వర్మ ఎప్పుడూ అంతే. ఎవరినైనా పొగడాలని ఫిక్స్ అయితే – అందులో పీక్స్ చూపించేస్తాడు. అఫ్కోర్స్ తిట్టినా అంతే అనుకోండి. తనపై ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా పూనేసింది. శిష్యుడు పూరి తీసిన సినిమా కాబట్టి – పొగడడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్టయిన తరవాత… పూరి, ఛార్మి చేసిన హంగామా కంటే – వర్మ చేసిన అల్లరే ఎక్కువ పాపులర్ అవుతోంది. మాస్ సినిమా తీయగల దమ్ముండు ఎందుకు తీయలేదు భాడకోవ్.. అంటూ పూరిని ఇష్టంగా తిట్టాడు. ఇప్పుడు నభా నటేషాని ఆకాశానికి ఎత్తేశాడు. `ఇలియానా 2.ఓ` అంటూ కితాబిచ్చాడు.
పూరి తీసిన పోరికి తరవాత ఇలియానా స్టార్ డమ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాతో టాప్ హీరోయిన్ అయిపోయింది. ఆ తరవాత వెనుదిరిగి చూసుకునే అవసరమే రాలేదు. నభాకి ఇది రెండో సినిమా. తొలి సినిమాతో నభా పెద్దగా మ్యాజిక్ ఏమీ చూపించలేకపోయింది. ఇందులో మాత్రం మాస్ పాత్రలో మెరిసింది. రామ్‌తో పోటీ పడుతూ ఎనర్జిటిక్‌గా కనిపించింది. నభా గ్లామర్‌ని పూరి పూర్తిగా వాడేసుకున్నాడు కూడా. అయితే.. ఇలియానాతో పోల్చే అందచందాలు నభాలో లేవన్నది వాస్తవం. నటనలోనూ ఏమాత్రం పోల్చలేం. కాకపోతే ఈ సినిమాతో నభా పెద్ద హీరోల దృష్టిలో పడుతుంది. మున్ముందు తన కెరీర్‌కి ఈ సినిమా ఓ ఫ్లాట్పామ్గా మారే అవకాశం ఉంది. అంతలోనే ఆహా.. ఓహో… ఇలియానా 2.ఓ.. అంటూ మునగ చెట్టు ఎక్కించడం తొందరపాటే అవుతుంది.