ఏ విషయం గురించైనా సరే కాంట్రవర్సీగా మాట్లాడుతూ స్టార్ డైరక్టర్ కన్నా విమర్శకుడిగా ఎక్కువ ఖ్యాతి సంపాధించుకున్నాడు రాం గోపాల్ వర్మ. ప్రస్తుతం కిల్లింగ్ వీరప్పన్ సినిమాతో మనముందు వస్తున్న వర్మ ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా తన మార్క్ కాంట్రావర్సీ మాటలు మాట్లాడుతూ వివాదానికి తెరలేపాడు. వీరప్పన్ సినిమా విశేషాలను గురించి మాట్లాడుతూ యాంకర్ అడిగిన మెగా ఫ్యామిలీ ముచ్చట్లు కూడా ఆడియెన్స్ తో పంచుకున్నాడు వర్మ.
మెగాస్టార్ 150వ సినిమాగా బ్రూస్ లీ చేయడమంత పెద్ద తప్పు పని ఇంకోటి లేదని.. అంటూ వివిధ రకాల కామెంట్లను ట్విట్టర్లో పోస్ట్ చేసి అభిమానుల ఆగ్రహానికి గురైన వర్మ వాటన్నిటికి వివరణ ఇచ్చుకున్నాడు. ఫ్యాన్స్ దానిపై సీరియర్ అయిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని మెగాస్టార్ చిరంజీవికి తాను పెద్ద ఫ్యాన్ అని.. ఏనుగు వెళ్తుంటే కుక్కలు చాలా మొరుగుతాయ్.. అలానే తాను మొరిగానని అన్నాడు. అయితే తనని కుక్కగా సంభోదించిన వర్మ తనలానే మిగతా ఫ్యాన్స్ కూడా కుక్కలే అంటూ వివాదానికి తెర లేపాడు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల మీద తను అభిమానంతోనే ట్వీట్ చేస్తా తప్ప వేరే ఉద్దేశం తనకు లేదని అన్నాడు. అయితే తనకు నచ్చినట్టే తన మాటలు ఉంటాయి తప్ప ఎవరికి సంఝాయిషి ఇచ్చుకునేలా ఉండవని మరోసారి తన పైత్యాన్ని చూపించాడు వర్మ. మొత్తానికి వర్మ తన తెలివితేటలతో ఆ ఇంటర్వ్యూని కానిచ్చేశాడు. ఇక తను తీసిన కిల్లింగ్ వీరప్పన్ వచ్చే నెల 4న రిలీజ్ అవుతుంది.