ఆర్జీవీ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని కనిపించకుండా పోయారని ఏపీ పోలీసులు ప్రత్యేక బృందాలను పెట్టి గాలిస్తున్నారని అంటున్నారు. కానీ ఆయన టాప్ చానళ్లను పిలిపించుకుని ఇంటర్యూలు ఇస్తున్నారు. తాజాగా ఆయన ఓ టీవీ చానల్ కు ఇంటర్యూ ఇచ్చారు. తాను చంద్రబాబు, పవన్, లోకేష్ అందర్నీ కించపరిచింది తన సినిమా ప్రమోషన్లకేనని.. అది తన హక్కు అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆయన వాదనలు ఎలా ఉన్నా.. పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదన్నది సస్పెన్స్ గా మారింది.
కోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతోంది. రెండు రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. గురువారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే పోలీసులు తొందరపాటు అనే భావన రాకుండా నింపాదిగా ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దారి తప్పిన సైకోల విషయంలో హైకోర్టు ఏ మాత్రం సానుభూతి చూపించడం లేదు. గుంటూరు మేయర్ కు నోటీసులు ఇవ్వమని చెప్పిన కేసు వేరు. ఆయన మీడియా ముందు ఘోరమైన బూతులు మాట్లాడారు. కానీ ఆర్జీవీని చేసింది వ్యవస్థీకృత నేరంలో భాగం.
సోషల్ మీడియాలో ఎదుటి వ్యక్తుల్ని కించ పరిచేందుకు ఆయన డబ్బులు తీసుకున్నారు. మామూలు సోషల్మీడియా కేసు అయితే అరెస్టు చేయరని ఆయనకూ తెలుసు. కానీ అంతకు మించిన స్కాం చేశారు కాబట్టే ఏ సెక్షన్లు పెట్టారో కూడా చెప్పలేదంటూ ఆయన కబుర్లు చెబుతున్నారు. గురువారం హైకోర్టులో ఆయనకు ఊరటలభిస్తే సరి లేకపోతే.. శుక్రవారం ఆయన జైలుకు వెళ్లడం ఖాయం. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ఏ జైలు ముందు సెల్ఫీ దిగారో.. అదే జైల్లో … వర్మ ఉంటారు. టీడీపీ కార్యకర్తలు బయట నుంచి సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పెడతారు.