కాంట్రవర్శి క్రియేట్ చేసి.. కావాల్సినంత పబ్లిసిటీ పొందడాన్ని ఏమంటారు..? ఇప్పటి వరకు దానికి ఎలాంటి పేరు లేదు కానీ… ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్ని అంచనా వేసుకుని..దాని మూలలను అన్వేషిస్తే..కచ్చితంగా దీనికి “ఆర్జీవీయిజం” అని నామకరణం చేసేయవచ్చు. ఓ ప్రముఖుడిపైన..ఏదో ఓ వివాదాస్పద వ్యాఖ్య చేసి.. దాన్ని టీవీలకు ఎక్కించి.. గంటల తరబడి డిస్కషన్లు పెట్టించి.. కావాల్సింత పబ్లిసిటీ పొందడంలో దిట్ట రామ్ గోపాల్ వర్మ అలియాస్ అర్జీవీ. ఆయన ఎన్టీఆర్ దగ్గర్నుంచి… మియా మాల్కోవా అనే పోర్న్ స్టార్ వరకూ.. ఎవర్నీ వదిలి పెట్టలేదు. మధ్యలో పవర్ స్టార్ , మెగా ఫ్యామిలీతో తో ఆయన ఆడుకున్న గేమ్… టీవీ చానళ్లకు.. టీఆర్పీల ఫెస్టివల్ తెచ్చి పెట్టింది. ఇటీవల ఆయన సినిమాల బిజీలోనో.. లేక కేసులయ్యాయని భయంతోనే కానీ.. కొద్దిగా దీనికి దూరంగా ఉన్నారు. కానీ ఆయన శిష్యులు ఈ పరంపర ప్రారంభించారు.
ఆర్జీవీ చూపించిన బాటలో… ముందుగా కత్తి మహేష్ అనే సినీ విమర్శకుడు రంగ ప్రవేశం చేశారు. బిగ్ బాస్ నుంచి నేరుగా టీవీ చానళ్ల స్టూడియోల్లోనే ఊడిపడ్డారు. దీనికి ఆయన ఆర్జీవీ చూపించిన కాంట్రవర్శీ మార్గాన్నే ఎంచుకున్నారు. ఇంకెవరైనా అయితే వర్కవుట్ అవదనుకున్నారో ఏమో కానీ.. నేరుగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నే టార్గెట్ చేశారు. దాదాపు రెండు నెలల పాటు ఈ ఎపిసోడ్ నడిచింది. పవర్ స్టార్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తూ… కత్తి మహేష్.. సెలబ్రిటీగా అవతరించాడు.
ఇది కొంచెం..కొంచెం కనుమరుగవుతున్న దశలోనే… కొంత మంది ఈ ఆర్జీవీయిజాన్ని అడాప్ట్ చేసుకుని రంగంలోకి దిగేశారు. జూనియర్ ఆర్టిస్టులు ఎక్కువ.. క్యారెక్టర్ ఆర్టిస్టుకు తక్కువ అన్నట్లు..ఒకరి రెండు సినిమాల్లో వేషాలేసి శ్రీరెడ్డి… తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలకు చాన్సివడం లేదంటూ.. మెల్లగా ప్రారంభించి… ఈ అర్జీవీయిజం .. విశ్వరూపాన్ని చూపించారు. ఈమె టాలీవుడ్ ను ఓ ఆట ఆడించేసింది. పవన్ కల్యాణ్ నూ డ్యామేజ్ చేసింది. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ అంటే తెలియని వాళ్లు కూడా ఉన్నారేమో కానీ..శ్రీరెడ్డి తెలియని వాళ్లు లేరు.
ఈ ఆర్జీవీయిజంలో… ఆర్జీవీ కూడా కల్పించుకుంటున్నారు. శ్రీరెడ్డి ఇష్యూలో అప్పుడప్పుడూ ట్వీట్లు చేస్తున్నారు. తన పేరు మీద తయారయిన ఆర్జీవీయిజంలో ఎలా పెర్ ఫార్మ్ చేయాలో కూడా.. శ్రీరెడ్డికి వర్మ సూచిస్తున్నారట. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో నోటి వెంట వచ్చిన మాదర్ చోడ్ అనే తిట్టుని.. పవన్ కల్యామ్ పై ప్రయోగించమని.. శ్రీరెడ్డికి ఆర్జీవీనే చెప్పారట. ఏ తిట్టు తిడితే ఎంత రెస్సాన్స్ వస్తుందో.. ఈ ఆర్జీవీయిజాన్ని క్రియేట్ చేసిన ఆయనకు తెలిసినంత ఎవరికైనా తెలుస్తుందా..? మొత్తానికి చాలా ఇజాల్లో .. ఇప్పుడు ఆర్జీవీయిజం కూడా చేరిపోయింది. దీన్ని నుంచి సెలబ్రిటీలు రక్షణ పొందడం అంత సులువేమీ కాదు..!