పెద్ద పెద్ద మాఫియా డాన్లతోనే ఫ్రెండ్ షిప్ చేసినట్లుగా గొప్పలు చెప్పుకునే ఆర్జీవీ ఏపీలో పోలీస్ కానిస్టేబుళ్లకు భయపడుతున్నారు. తాను విచారణకు రాలేనని చెబుతున్నారు. అత్యవసర షూటింగులు ఉన్నాయని చెబుతున్నారు. ఆయనకు పనేమీ లేక ఇలా ట్వీట్లకు డబ్బులు తీసుకునే స్టేజ్లో ఉన్నారు.. ఇక షూటింగులు ఎక్కడ ఉన్నాయని ఇండస్ట్రీలో సెటైర్లు వినిపిస్తున్నాయి. కోర్టుకు వెళ్లి చీవాట్లు తిన్నప్పటికీ ఆయన తగ్గలేదు. మళ్లీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి విచారణకు డుమ్మా కొట్టారు.
వర్మ విచారణకు హాజరు అయితే అరెస్టు చేస్తారో లేదో తర్వాత కానీ ఇప్పుడు కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ విషయంలో ఎదురు దెబ్బ తింటే మాత్రం ఖచ్చితంగా మరో చాయిస్ లేకుండా ఊచలు లెక్కబెట్టాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన వ్యవహారంలో హైకోర్టు కూడా చాలా సీరియస్ గా ఉంది. ఎవరికీ ముందస్తు బెయిల్స్ ఇవ్వడం లేదు. అరెస్టుల నుంచి రక్షణ కల్పించడం. లేదు. ఆ సైకో మూక సంగతి తేల్చాలన్నట్లుగా అన్ని వ్యవస్థలు పని చేస్తున్నాయి. అందులో భాగమైన వారు ఎంత ప్రముఖులైనా వదిలి పెట్టడం లేదు.
ఆర్జీవీ నోటీసులు తీసుకోవడానికే డ్రామాలు ఆడారు. కానీ చివరికి తీసుకోవాల్సి వచ్చింది. పోలీసుల నుంచి తప్పించుకోలేరనడానికి అదే ఊదాహరణ. విచారణకు హాజరైతే.. గౌరవంగా ఉండేది. కానీ ఆయన భయపడుతున్నారు. ఆర్జీవీని చేసిన పోస్టులు.. తీసుకున్న డబ్బుల లెక్కలు మొత్తం ఇప్పుడు బయటపెట్టి .., వర్మ ఎంత చీప్ అయిపోయాడో బయట పెట్టనున్నారు. దిగ్గజ దర్శకుడి అత్యంత ఘోర పతనాన్ని మన కళ్ల ముందు పోలీసులు పెట్టనున్నారు.