రామ్ గోపాల్ వర్మ వైసీపీ నుంచి డబ్బులు తీసుకుని సోషల్ మీడియాలో వారు పంపిన కంటెంట్ ను పోస్టు చేసేవారు. ఓ రకంగా ఆయన ట్విట్టర్ హ్యాండిల్ వైసీపీ సోషల్ మీడియాకు అద్దెకు ఇచ్చారని అనుకోవచ్చు. ఇందు కోసం ఆయనకు పెద్ద మొత్తంలో డబ్బు ముట్టింది. అది కూడా వైసీపీ పార్టీ పరంగా కాదు.. ప్రభుత్వ ఖాతా నుంచి. ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మకు రెండుజీవోల ద్వారా దాదాపుగా రూ.కోటిన్నర వరకూ చెల్లించారు. ఆయన ప్రభుత్వానికి ఏ సేవలు చేస్తే అంత మొత్తం చెల్లించారో ఎవరికీ తెలియదు.
ఆయన వైసీపీకి పని చేశారు. చంద్రబాబు , పవన్ కల్యాణ్, లోకేష్‌లను బూతులు తిట్టారు. మార్ఫులు వేశారు. వైసీపీ కోసం సినిమాలు తీశారు. అది జగన్ రెడ్డిని పొగుడుకోవడానికి అయితే ఎవరూ అభ్యంతర పెట్టరు. చంద్రబాబు, పవన్, లోకేష్‌లను కించ పరచడానికి తీశారు. దానికి ప్రతిఫలంగా డబ్బులు తీసుకున్నారు. ఇది వ్యవస్థీకతంగా.. ఆర్గనైజ్డ్గా చేసిన క్రైమ్. ఈ క్రైమ్‌లో రామ్ గోపాల్ వర్మ కూడా ఓ పాత్రధారి. దాన్ని ఎక్స్ పోజ్ చేయడానికి పోలీసులకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. మొత్తం. కుట్రలో ఆర్జీవీని పాత్రను బయట పెడతారు. జైలుకు పంపుతారు.
అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే… మిగతా వాళ్లు డబ్బుల కోసం కక్కుర్తి పడి ఇలాంటి తప్పుడు పనులు చేశారంటే ఏమో అనుకోవచ్చు.. కానీ ఆర్జీవీకి ఏం అవసరం?. ఆయన జీవితంలో సంపాదించిన పేరుకు.. చేస్తున్న పనులకు సంబంధం ఉందా ?. దేశంలో దిగ్గజ దర్శకుడు ఇలా చీప్‌గా డబ్బులు తీసుకుని తన సోషల్ మీడియా అకౌంట్లో రాజకీయ మార్ఫింగులు వేసుకునే దుస్థితికి దిగజారడమా ?. ఆయనకు పరువు లాంటివి ఏమీ ఉండకపోవచ్చు…కానీ ఆయన సినిమా చూసి అభిమానించేవారు మాత్రం సిగ్గుతో తలదించుకుంటారు.