జైల్లో వేస్తే కథలు రాసుకుంటానని కథలు చెబుతున్నారు రామ్ గోపాల్ వర్మ. ఇంత బతుకు బతికీ తాను సినిమాల్లో చూపించిన స్టైల్లో ఓపెన్ టాయిలెట్ పక్కనే తిండి, నిద్ర గడపాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారన్న విషయం ఆయన మొహం చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. తాను పోరిపోలేదని.. ఎన్ని కబుర్లు చెప్పినా.. ఆయన ఎంత భయపడుతున్నారో అందరూ అర్థం చేసుకోగలరు. చేయడానికి సినిమాల్లేక.. ట్విట్టర్ ను అద్దెకు ఇచ్చుకున్న ఆయన ఇప్పుడేదో బిజీ డైరక్టర్ ను అన్నట్లుగా కథలు చెబుతున్నారు
ఆయనకు చేయడానికి సినిమాల్లేవని ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. ఆయన చాన్సులిచ్చిన వారు. బిజీగా తమ పని తాము చేసుకుంటున్నారు. కానీ ఆర్జీవీ మాత్రం లేనిపోనివి పెట్టుకుని కెరీర్ నాశనం చేసుకున్నారు. వైసీపీ ఇచ్చే చిల్లర కోసం ఆశపడి మొదటికే మోసం తెచ్చుకున్నారు. కోర్టు కొన్నాళ్లు ఉపశమనం కల్పించవచ్చు కానీ చేసిన తప్పుల్నుంచి మాత్రం తప్పించుకోలేరు. ఏడాది కిందట పెట్టిన పోస్టులకు ఇప్పుడు కేసులు పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు.. ఏడాది కిందట మర్డర్ చేస్తే ఇప్పుడు కేసులు పెట్టకూడదా?. నేరం ఏదైనా నేరమే.
ఆర్జీవీ అనే వ్యక్తి దర్శకుడిగా దిగ్గజం. కానీ ఇప్పుడు అదంతా పోగొట్టుకున్నారు. ఆయనను ఓ పేటీఎం కార్యకర్తగా చూస్తున్నారు. డిజిటల్ కార్పొరేషన్ నుంచి ట్వీట్లు పెట్టినందుకు ఆయన డబ్బులు తీసుకున్నారని ఆధారాలతో సహా కొత్త కేసులు రెడీ చేస్తున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా ఆయన జైలుకు వెళ్లడం ఖాయమే. ఆయన అంటే అభిమానం ఉన్న వారు కూడా ఆయనను జైల్లో వేస్తే.. మంచి కథలు రాసుకుని కమ్ బ్యాక్ ఇస్తారేమోనని ఆశపడుతున్నారు. అందుకైనా ఆర్జీవీని జైల్లో వేయాల్సిందేనేమో ?