కాదేదీ కెలకడానికి అనర్హం అనుకొంటాడు వర్మ. అదీ ఇదీ అని కాదు.. ఏది పడితే దాన్ని తనదైన శైలిలో చీల్చి చెండాలడాడు. మామూలుగా చెప్పుకోవాలంటే కోడి గుడ్డుపై ఈకలు పీకడం అంటారే… వర్మ ఆ బాపతే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. తాజాగా హోళీ పండగపై విరుచుకుపడ్డాడు వర్మ. ఆ సంబరాన్ని తనదైన వికృతిక కోణంలో చూసి… పైచాచిక అర్థాన్నిచ్చాడు.
హిరణ్య కశ్యపుడి చెల్లెలు హోలిక నుంచి ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడినందుకు ప్రజలంతా హోలీని జరుపుకొంటారు… నాకు మాత్రం ఈ పండుగ నాడు భంగ్ తినడం, శృంగారం ఒలికించే అమ్మాయిలను చూడటం, పాఠశాలను ఎగ్గొట్టడం వంటివే ఆనందాన్నిస్తాయి అంటూ వర్మ ట్వీట్ చేశాడు.
అందమైన అమ్మాయిలను తడిచిన దుస్తుల్లో చూడ్డానికి హోళీ ఓ వేదిక అంటూ నిర్వచించాడు వర్మ. అలా చూసినా.. పెద్దలు ఏమీ అనకుండా ఉండడానికి, చెంపదెబ్బల నుంచి తప్పించుకోవడానికీ హోలీని ఉపయోగించుకోవచ్చని అన్నాడు. మరే… వర్మ ముందు రామా అన్నా.. పరమ బూతై పోతుంది. పచ్చకామెర్ల వాడికి లోకమంతా అలానే కనిపిస్తుంది పాపం. ఆ తప్పు మనది కాదు. రోగం ఆయనదే.