పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై సోషల్ మీడియా వేదికగా, రాం గోపాల్ వర్మ వ్యంగ్యస్త్రాలు విడిచారు.” పవన్, సన్నీలియోన్ తో కలిసి రాజకీయ కూటమి ఏర్పాటు చేస్తే అసాధారణ రాజకీయ శక్తిగా మారుతారని తన ప్రగాఢ నమ్మకమని, ఎందుకంటే ఇద్దరు వేరు వేరు విధాలుగా ప్రజలకి వేరు వేరు వినోదాత్మక సుఖాలు ఇచ్చారని” వర్మ పేర్కొన్నాడు. అలాగే సన్నీలియోన్‌కు పవన్ కళ్యాణ్‌కు మధ్య ఒకరిని కౌగిలించుకునే అవకాశం వస్తే ఎవరిని కౌగిలించుకుంటారన్నది పవన్ అభిమానిగా పవన్ లక్షల అభిమానులకు నా ప్రశ్న. అని అభిమానులను ఆగ్రహానికి గురిచేసే పోస్టు పెట్టారు. ఈ పోస్టులు పవన్ కళ్యాణ్ అభిమానులకి చిరాకు తెప్పించి అసహనం కలిగించే లక్ష్యాన్ని కలిగిఉన్నవేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వర్మ ఎప్పుడెలా స్పందిస్తాడో ఎవరికీ తెలీదు కాబట్టి ఆయన్ని పట్టించుకోనవసరం లేదనీ, పట్టించుకోననీ పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పడం తో వర్మ పోస్టులని గట్టించుకునే వాళ్ళు తగ్గిపోయారు. అయితే ఇక్కడ సాక్షి తీరే సందేహాస్పదంగా ఉంది.
ఎన్ టీయార్ త్రివిక్రం సినిమా ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాన్ వచ్చి ఎంతో సేపు గడిపితే, తన ఫోటో కానీ, తన ప్రస్తావన గానీ లేకుండా రిపోర్ట్ చేసిన సాక్షి ఇలాంటి పోస్టుల విషయానికి వచ్చేసరికి ఫోటోలు వెతికి మరీ పట్టుకొచ్చి కథనం వ్రాయడం సాక్షి “సెలెక్టివ్ రిపోర్టింగ్” కి నిదర్శనం అని పరిశీలకులు పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. తమ ప్రత్యర్థి పార్టీ మీద విమర్శలు తమ స్వంత పత్రికలో హైలెట్ చేయడం తప్పేమీ కాదు (ఇప్పుడున్న జర్నలిజం స్టాండర్డ్స్ ప్రకారం) కానీ ఇలా వెగటు పుట్టించే వ్యాఖ్యల్ని కూడా హైలెట్ చేయడం పవన్ ఫ్యాన్స్ ని మరింత కెలికే ప్రయత్నమే తప్ప మరేమీ కాదనీ పవన్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.