సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు గిన్నీస్ బుక్‌పై ఓ లుక్ వేశాడు. తన సినిమా వంగవీటిని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలని స్కెచ్చులు గీస్తున్నాడు. వంగవీటికి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కే అర్హత నూటికి నూరుపాళ్లూ ఉందన్నది వర్మ నమ్మకం. దానికీ ఓ కారణం ఉంది. ఓ సినిమాలో ఎక్కువ మంది నిజ జీవిత కథలు చూపిస్తున్న చిత్రంగా వంగవీటిని గిన్నిస్ బుక్‌లోకి ఎక్కే అవకాశం ఉందట. వర్మ తాజా సంచలనం.. వంగవీటి. రెండు దశాబ్దాల క్రితం విజయవాడ చుట్టుపక్కలే రాకుండా, రాష్ట్ర రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన చరిత్ర వంగవీటిది. ఆ కథనే ఇప్పుడు వర్మ సినిమానే తీస్తున్నాడు.
ఇందులో వర్మ.. వంగవీటినే కాదు… దాదాపు 20 మంది నిజ జీవిత కథల్ని తెరపై చూపించబోతున్నాడట. జ్యోతుల నెహ్రూ, రాజీవ్‌గాంధీ, ఎన్టీఆర్, దాసరి.. ఇలా ఆ లిస్టు చాలా పెద్దదే ఉంది. ఒకే సినిమాలో ఇంతమంది జీవిత కథలు చూపించడం, వాళ్ల నిజ జీవిత సంఘటల్ని సినిమాగా మలచడం ఇదే తొలిసారట. అందుకే గిన్నీస్ వరకూ తన సినమాని తీసుకెళ్లాలని భావస్తున్నాడు వర్మ. ఆయన అ్నంత పనీ చేయగలడు. మరి వంగవీటి గిన్నీస్ బుక్ ఎక్కుతుందా, లేదా? తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.