సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలయ్యి ఇంకా మూడు రోజులు కూడా కాకముందే పవన్ కళ్యాణ్ తన తరువాత సినిమా గురించి ప్రకటించేశారు. ఈనెలాఖరు నుంచే ఎస్.జె. సూర్య దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించారు.
మరో శుభవార్త ఏమిటంటే, రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ ఇక తన జీవితంలో మళ్ళీ ఎన్నడూ పవన్ కళ్యాణ్ గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయనని ఇవ్వాళ్ళ ప్రకటించేశారు. ఒక నిజమయిన అభిమానిగా పవన్ కళ్యాణ్ గురించి చేస్తున్న వ్యాఖ్యలకు ఆయన అభిమానులు అపార్ధం చేసుకొంటున్నారు కనుకనే ఈ నిర్ణయం తీసుకొంటున్నట్లు తెలిపారు. తన మెసేజ్ చివర్లో “బై..బై… పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్” అని గుడ్ బై చెప్పేశారు.
ఎవరినీ అంత తేలికగా వదిలిపెట్టని రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ, పవన్ కళ్యాణ్ న్ని మాత్రం అంత తేలికగా ఎందుకు వదిలిపెట్టేసారో? బహుశః పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఘాటయిన జవాబు చూసా లేకపోతే తన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం వలననో తెలియదు కానీ ఇకపై పవన్ కళ్యాణ్ జోలికి రానని ప్రకటించేశారు కనుక ఇంక ఆయన, అభిమానులు కూడా నిశ్చింతగా ఉండవచ్చును. కానీ రామ్ గోపాల్ వర్మ ఎంత కాలం తన మాటకి కట్టుబడి ఉంటాడో?