అరవింద్ గారి కామెంట్: ఒక మనిషికి కొన్ని రోల్స్ ఉంటాయి.. ఇండస్ర్టీలో సీనియర్ గా నాకు గౌరవం ఉంది.
RGV: ఎవరు కాదన్నారు? ఎవరు లేదన్నారు?
అరవింద్ గారి కామెంట్: శ్రీ రెడ్డి వ్యవహారం పై చాలా సార్లు ఛాంబర్ లో చర్చించాం. రెండు మీటింగ్స్ లో పాల్గొన్నా
RGV: అది బహిరంగంగా చర్చించాల్సిన విషయం..పవన్ విషయానికి ఇంత ఫాస్టుగా వచ్చారు కానీ ఆ విషయంలో ఇండస్ట్రీకి అంత పెద్ద సీనియర్ గా నెల రోజులుగా ఒక చిన్న కామెంట్ కూడా చెయ్యలేదు మీరు
అరవింద్ గారి కామెంట్: అంతర్గతంగా ప్రభుత్వం నిబంధనలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి..సినీ పరిశ్రమలో మహిళ పై లైగికంగా వేధిస్తే కమిటీ ద్వారా విచారణ చర్యలు తీసుకుంటామ్
RGV: అదేకదా నేను 20 రోజుల నుంచీ నేత్తి నోరు బాదుకుంటూ అరుస్తున్నది.
అరవింద్ గారి కామెంట్: ఇండస్ట్రీ తీసుకుంటున్న కమిటీ లో నేను మెంబర్ గా ఉంటున్న
RGV:గ్రేట్..
అరవింద్ గారి కామెంట్: ఇండస్ట్రీ కి RGV చాలా ద్రోహం చేస్తున్నాడు
RGV: పవన్ కళ్యాణ్ లాంటి లక్షలమంది ఫాన్స్ వున్న తనని అలాంటి మాట అనిపించి నాకు నేను ద్రోహం చేసుకుంటున్నాను కాని ఇండస్ట్రీకి ఎలా ద్రోహం చేస్తున్నాను?
అరవింద్ గారి కామెంట్: నిన్న RGV కి చెందిన వీడియో చూశాను.శ్రీ రెడ్డి పవన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల వెనక రామ్ గోపాల్ వర్మ ఉన్నాడన్నది స్పష్టం అయ్యింది.
RGV: వీడియోలో ఆ తప్పు చేసింది నేనేనని చెప్పింది నేనే కదా ..ఇంకా అందులో స్పష్టమవడానికి ఏముంది?
అరవింద్ గారి కామెంట్:5 కోట్లు శ్రీ రెడ్డి కి ఆఫర్ చేసిన సొమ్ము ఎక్కడిది..? అతని ఆర్థిక స్థోమత ఏంటో తెల్సు.
RGV: దీనితో మీరు వీడియో చూడలేదని తెలుస్తోంది .. సురేష్ తో మాట్లాడి అభిరామ్ విషయంలో ఇప్పించటానికి ట్రై చేస్తానని చెప్పాను …అంతే కానీ పవన్ కి ఆ 5 కోట్లకి సంబంధం లేదు ..కనీసం ఇప్పుడైనా ఆ వీడియో చూడండి
అరవింద్ గారి కామెంట్: పవన్, ఫాన్స్ పై ఉన్న కోపం తో శ్రీ రెడ్డి ని పావులు చేసి ఆడిస్తున్నావ్
RGV: సార్ అరవింద్ గారు, పవన్ ఫాన్స్ ప్రేక్షకులు, పైగా కోట్లమంది..ఏ ఫిలింమేకర్ అయినా ప్రేక్షకుల తో కోపం కానీ కక్ష కానీ పెట్టుకుంటాడా?
అరవింద్ గారి కామెంట్:నీ అమ్మ చెల్లి ని నీ ముందు ఉంచి నాలుగు అక్షరాల ఇంగ్లీష్ బూతు పదం అంటే ఎలా ఉంటుంది.! కానీ మా నైతికత అది కాదు.
RGV: నా నైతికత కూడా అది కాద్దండీ . .నేనెప్పుడూ బూతు పదాలు వాడను..కావాలంటే మీరెవరినైనా అడగచ్చు..కానీ అక్కడి సందర్భం నేను వీడియోలో వివరించాను
అరవింద్ గారి కామెంట్: ఇండస్ట్రీ లో తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన ఘనత RGV ది.
RGV: ఇండస్ట్రీ మీరా? పవన్ కళ్యాణా?మీరు నాకు బ్రేక్ ఇచ్చారా? తల్లి పాలేంటి? నేను పవన్ ని అలా అని నా రొమ్ము నేను గుద్దుకున్నాను కానీ ఇంకెవరి రొమ్ము గుద్దలేదు
అరవింద్ గారి కామెంట్:పవన్ స్థాయి తగ్గిచడానికి నువ్వు చేస్తున్న పతకం వెనక ఎవరున్నారు…?
RGV: పవన్ ఒక ఆకాశమంత ఎత్తున్న సూపర్ స్టార్ లీడర్..అతని స్థాయి తగ్గించడానిక ఆఫ్ట్రాల్ నేనెవరిని? మీరు నమ్మినా నమ్మకపోయినా కేవలం నా స్వభావం తప్ప నా వెనుక ఎవరూ కానీ, ఏ పార్టీకాని లేరు..గత పదేళ్లుగా ఇన్సిడెంట్ల గురించి దేవుళ్ళ గురించి, సెలెబ్రిటీల మీద, గవర్నమెంట్ గురించి నేనెప్పుడూ ఏదో అంటూనే వచ్చాను.
అరవింద్ గారి కామెంట్: రాంగోపాల్ వర్మ నీచూడు..తాను చేసినదానికి చాలా డిప్రెషన్ లో ఉన్నాను
RGV: అరవింద్ గారు మీ మీద నాకు చాలా గౌరవముంది..ఎప్పటికీ ఉంటుంది..100% నేను చేసింది క్షమించరాని తప్పు..మళ్ళీ ఇంకొకసారి మీకు,పవన్ కళ్యాణ్ కి మీ కుటుంబ సభ్యులకీ ఫాన్స్ కీ అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను.అంతే కాకుండా మళ్ళీ ఎప్పుడూ పవన్ మీద కానీ, మీ మిగతా ఫ్యామిలీ మెంబెర్స్ మీద కానీ నెగటివ్ కామెంట్స్ పెట్టనని మా మదర్ మీద, నా వృత్తి మీద ఒట్టేసి చెబుతున్నాను.
గతంలో నా ఒట్లు నేను నిలబెట్టుకోకపోయుండచ్చు కానీ మా మదర్ మీద నేనెప్పుడూ ఒట్టేయ్యలేదు