వర్మ ఏదీ మనసులో దాచుకోడు. ఎవరిపైన ఏమున్నా కక్కేస్తాడు. అది సోషల్ మీడియాలో కావొచ్చు. సిల్వర్ స్క్రీన్ పై కావొచ్చు. రకరకాల కామెంట్లు, సినిమాలతో స్వీట్ రివైంజ్లు తీర్చుకుంటాడు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కీ వర్మకీ ఎప్పటి నుంచో రగడ ఉంది. దానికి ప్రతీకారంగానే `పవర్‌స్టార్`ని వదలబోతున్నాడు. ఇప్పుడు బాలకృష్ణపై ఉన్న కోపాన్ని తీర్చుకునేందుకు, పాత లెక్కల్ని సరి చేసేందుకు కూడా ఓ సినిమా తీయబోతున్నాడని టాక్.
ఎన్టీఆర్ బయోపిక్‌ని బాలయ్యతో తీయాలని భావించాడు వర్మ. కానీ కుదర్లేదు. ఆ అవకాశం చేతులు మారి, క్రిష్ కి వెళ్లింది. ఆ కోపంతోనే `లక్ష్మీస్ ఎన్టీఆర్` తీశాడు. అయినా ఆవేశం తగ్గలేదు. ఇప్పుడు ఓ సినిమా తీస్తున్నాడట. `ఆ రాత్రి ఏం జరిగిందంటే` అనేది టైటిల్. ఇది బాలయ్య గురించేనని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. బాలయ్య ఇంట్లో కాల్పుల ఘట్టం ఇప్పటికీ మిస్టరీనే. ఆ తరవాత బాలయ్య ఇంటి చుట్టూ చాలా ఘటనలు జరిగాయి. ఈ కేసు నుంచి బాలయ్య ఎలా బయటపడ్డాడు? అనే దానిపై రకరకాల కథనాలు. వాటికి ఇప్పుడు వర్మ కొత్త యాంగిల్ ఇవ్వబోతున్నాడట. `పవర్ స్టార్` తరవాత వర్మ చేపట్టబోయే ప్రాజెక్టు ఇదేనని టాక్. బాలయ్య ఆవేశం, బాలయ్య నమ్మకాలు, అభిమానులకు ఇచ్చే చెంపదెబ్బలు, వల్లించే సంస్క్రృత శ్లోకాలూ.. ఇవన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయని, ఇది కూడా ఏటీటీ ఫ్లాట్ ఫామ్ కోసమే తీయబోతున్న షార్ట్ ఫిల్మ్ లాంటి సినిమానేని తెలుస్తోంది.