వైసీపీ ఇప్పుడు అనూహ్యంగా రాంగోపాల్ వర్మని నమ్ముకొంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. సినిమాల రూపంలోనూ ప్రచారం చేసుకోవాలని భావిస్తోంది. అందుకే వర్మని అర్జెంటుగా రంగంలోకి దింపింది. వర్మతో ఇప్పుడు వైకాపా మూడు సినిమాలకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అందులో రెండు సినిమాలు ప్రత్యర్థులపై డెరెక్ట్ ఎటాక్ చేయించేవి అయితే, మరోటి.. సొంత పార్టీని ఎలివేట్ చేసేవి. జగన్ జీవితం, ఆయన విజయాలు, పథకాలపై ఓ సినిమా చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉంది వైసీపీ. అందులో భాగంగా `జగన్నాథ రథ చక్రాలు` అనే పేరుతో సినిమా తీయాలని చూస్తున్నారు. ఇందులో అన్నీ జగన్ ఎలివేషన్లే ఉంటాయన్న విషయం.. టైటిల్ చూస్తే అర్థమైపోతోంది. డిసెంబరులో ఈసినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. వర్మ చాలా తక్కువ సమయంలో సినిమాలు తీసేస్తాడు. దానికి తోడు… నిజ జీవిత పాత్రలు పోలిన నటీనటుల్ని ఎంచుకోవడంలో సిద్ధహస్తుడు. అందుకే వైసీపీ వర్మ వైపు చూస్తోంది. అయితే వర్మ ఎన్ని రాజకీయ సినిమాలు తీసినా.. అవి వెండి తెరపై పండలేదు. జనాలూ సీరియస్ గా పట్టించుకోలేదు. కానీ… వైసీపీ ఎలా నమ్ముతోందో?