వర్మ ఖాళీగా ఉండడు. ఉన్నచోట అస్సలుండడు. ఎవరినో ఒకరిని కెలకడమే పని. ఇప్పుడు అల్లు అర్జున్ – పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మధ్య పుల్లెట్టే ప్రయత్నం చేశాడు. నీ కంటే లేటుగా వచ్చిన బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోతే.. నువ్వు ఇంకా తెలుగు పట్టుకునే వేలాడుతున్నావ్… అంటూ పరోక్షంగా పవన్‌కి చురక అంటించాడు. ఈరోజు పొద్దుపొద్దునే వరుస ట్వీట్లతో హోరెత్తించాడు వర్మ. ఈ ట్వీట్ల అంతరార్థం.. పవన్ పాన్ ఇండియా స్టార్ కావడమే.
“ఎప్పుడో మీ తరవాత వచ్చిన పిల్లలు ఎన్టీఆర్, చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతోంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడడం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది. దయ చేసి భీమ్లా నాయక్‌ని పాన్ ఇండియా కు తీసుకెళ్లి.. మీరు సబ్ కా బాప్ అని ప్రూవ్ చేయండి. పుష్పనే అంత చేస్తే.. భీమ్లానాయక్ ఇంకెంత కలెక్ట్ చేయాలి? పవన్ ఇండియా సినిమాలాగా రీలీజ్ చేయకపోతే.. మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్‌కి ఆన్సర్ చేయలేము. అల్లు అర్జున్ గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైమ్ లో పెట్టాను. కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైమ్ లో పెడుతున్ఆ. దీన్ని బట్టి నా సీరియస్‌నెస్ అర్థం చేసుకోండి“ ఇలా సాగాయి ట్వీట్లు.
ఇవన్నీ పరోక్షంగా పవన్ ఫ్యాన్స్‌కీ, బన్నీ ఫ్యాన్స్‌కీ మధ్య పుల్ల పెట్టడమే. భీమ్లా నాయక్‌ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసే ఉద్దేశ్యమే చిత్రబృందానికి లేదు. ఈ సంగతి వర్మకీ తెలుసు. అందుకే కావాలని ఇలాంటి ట్వీట్లు చేసి, పవన్ ఫ్యాన్స్‌కీ, బన్నీ ఫ్యాన్స్‌కీ మధ్య లింకు పెట్టాలని చూస్తున్నాడేమో..?