వర్మ మాటల్లో భలే మ్యాజిక్ ఉంటుంది. అది పొగడ్తలా కనిపించినా, అందులో తిట్టుంటుంది. తిట్టాడో.. పొగిడాడో.. అసలు ఆ వ్యాఖ్యలకు ఎలా స్పందించాలో తెలీక జుట్టుపీక్కునేలా చేస్తాడు వర్మ. గత కొన్నిరోజుల నుంచి గౌతమిపుత్ర శాతకర్ఱి సినిమాని తెగ పొగిడేస్తున్నాడు రాంగోపాల్ వర్మ. బహుశా ఈ సినిమాకి పోటీగా వస్తున్న చిరు సినిమాని కాస్త డీగ్రేడ్ చేయాలన్న ఉద్దేశం కూడా వర్మకి ఉండొచ్చు. పైకి మాత్రం క్రిష్ తీస్తున్న సినిమా తనకెంతో నచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అయితే.. ఈసినిమాలోని కొన్ని సీన్లు చూసిన వర్మ మాటల్లో ఏదో నిజం ఉందన్నది బాలయ్య అభిమానుల నమ్మకం. ఎవరి అభిప్రాయం వాళ్లది కాదనలేం. అయితే.. వర్మ ఈసారి పొగడ్తల డోసు పెంచాడు. గౌతమిపుత్ర శాతకర్ణి బాలీవుడ్ స్థాయి సినిమా అన్నట్టు ఈ సినిమా చూసి అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ స్టన్ అయిపోయినట్టు ఓ ట్వీట్ చేశాడు. ముంబైలో గౌతమిపుత్ర షో పడినట్టు.. దాన్ని ఈ ఖాన్ త్రయం చూసినట్టు, క్రిష్ ప్రతిభకు బౌల్డ్ అయిపోయి వరుసగా అవకాశాలు ఇచ్చేసినట్టు ఇలా ఏదేదో ట్వీట్ చేసేశాడు.
ఇదంతా నిజమా?? వర్మ కల్పనా చాతుర్యమా? వర్మ భవిష్యత్తుని ఈ రేంజులో ఊహిస్తున్నాడా? ఇలా ఎవరి వ్యాఖ్యానాలు వాళ్లు చేసుకొంటున్నారు. అయితే వర్మనీ, అతని పైత్యాన్నీ దగ్గరగా గమనించేవాళ్లు మాత్రం ‘శాతకర్ణిపై కూడా సెటైట్లు మొదలెట్టేశాడు వర్మ..’ అంటూ జోకులు వేసుకొంటున్నారు. నిన్నా మొన్నటి వరకూ ఆహా.. ఓహో అన్న వర్మ సడన్‌గా ఇలా ఎందుకు మారిపోయాడు చెప్మా? ఎందుకంటే.. క్రిష్ ఇప్పుడు మెగా కాంపౌండ్‌కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే… ‘ఖైదీ సినిమా కూడా బాగా ఆడాలి’ అంటూ కాస్త కూల్ కూల్‌గా మాట్లాడుతున్నాడు కాబట్టి. ఇవన్నీ వర్మకి నచ్చడం లేదేమో..?? అందుకే శాతకర్ణి కూడా వర్మ టార్గెట్ లిస్టులో చేరిపోయింది. మున్ముందు ఇంకెన్ని పిచ్చి పిచ్చి ట్వీట్లు చేస్తాడో వర్మ.