రాంగోపాల్ వర్మ రొమాంటిక్ అన్న సంగతి అందరికీ తెలుసు. అందం – అమ్మాయిలు ఇవి తప్ప ఆయన్ని అమితంగా ప్రభావితం చేసే విషయాలు ఈ లోకంలోనే లేవు. సెక్స్ గురించి కూడా విచ్చలవిడిగా మాట్లాడేయంలో దిట్ట! ఉన్నది ఉన్నట్టు మొహం మీదే చెప్పేసి, అందర్నీ షాక్లో పడేసే వర్మ ఇప్పుడు ఓ దర్శకుడితో లిప్ లాక్ చేయాలని ఉందంటూ కామెంట్ చేసి… మరోసారి సంచలనానికి తెరలేపాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు.. వర్మ శిష్యుడు అనురాగ్ కాశ్యప్. ఆయన తీసిన ఉడ్తా పంజాబ్ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి దాదాపు 89 కట్లు చెప్పింది. ఈ విషయంలో సెన్సార్ బోర్డుపై కోర్టుకెక్కి అందులో విజయం సాధించాడు అనురాగ్.
అది గురువు వర్మకి విపరీతంగా నచ్చేసిందట. అసలే సెన్సార్ అంటే వర్మకు విపరీతమైన కోపం. సెన్సార్ ఓటమి.. ఆయన విజయం కిందే లెక్క. అందుకే శిష్యుడ్ని తెగ మెచ్చుకొంటూ, లిప్ లాక్ చేయాలని వుందంటూ..కాస్త అదుపు తప్పి మాట్లాడాడు. అంత మాత్రాన తమ ఇద్దర్నీ గే అనుకోవద్దని ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు వర్మ. ఏంటో ఈ వర్మ.. అస్సలు అర్థం కాడు. మరి గురువు కోరిక శిష్యుడి వరకూ వెళ్లిందో లేదో??