వర్మ ఉండేది హైదరాబాద్ లో. కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి వర్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది హైదరాబాద్ లో . కానీ వర్మకు ఏపీ పోలీసులే కనిపించారు. ఆయన ప్రత్యేక విమానం బుక్ చేసుకుని హైదరాబాద్ నుంచి విజయవాడ పోతే.. అలాంటి వాళ్ల కోసమే తాను ఉన్నానన్నట్లుగా డీజీపీ తన చాంబర్ లోనే ఫిర్యాదు తీసుకున్నారు. జ్యూరిస్ డిక్షన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకోపో అని చెప్పలేదు. ఆయన ఆదేశానుసారం కేసు నమోదు చేస్తారో లేదో కానీ.. పోలీసులపై మాత్రం అనేక అనుమానాలు కలుగుతున్నాయి. హైదరాబాద్ లో పోలీసులు ఉన్నారు. హైదరాబాద్ లోని తన ఆపీస్ ముందు టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు తగలబడితే హైదరాబాద్ లోనే ఫిర్యాదు చేశారు.
మరి ఈ కేసు కోసం ఎందుకు విజయవాడకు వెళ్లారు. కొలికపూడి శ్రీనివాసరావు మీద ఏపీ సర్కార్ పెద్దలకు చాలా కోపం ఉంది. ఆయనను అరెస్టు చేయాలని ఆయనే మిగిలిపోయారని ఫీలవుతున్నారని చెబుతారు. అందుకే ఆర్జీవీని విజయవాడ పిలిపించి ఫిర్యాదు ఇప్పించినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఏపీ పోలీసులు ఏమని కేసు నమోదు చేస్తారు ?. చేసినా ప్లేస్ ఏమని చెబుతారు.. హైదరాబాద్ లో జరిగితే… ఏపీలో ఎందుకు కేసు నమోదు చేశారని కోర్టు ప్రశ్నిస్తే ఏం చెబుతారు ? ఏమీ చెప్పరు.. కోర్టు ఏం చేసినా తుడిచేసుకుంటారు.. పోలీసు వ్యవస్థకు రోజూ ఇది మామూలైపోయింది.
అయినా ఆర్జీవీకి ఇప్పుడే తెలంగాణ పోలీసులపై నమ్మకం లేకపోతే.. మూడు నెలల తర్వాత ఆయన ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉండకుండా.. వేరో చోటు వెదుక్కోవాలేమో అన్న సెటైర్లు సహజంగానే పడుతూంటాయి.