సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ముఖ్య పాత్ర వహించిన ఈ సినిమాలో వీరప్పన్ గా ఢిల్లీకి చెందిన రంగస్థల కళాకారుడు పృధ్విరాజ్ నటించాడు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ని పోలీసుకు ఏ విధంగా పట్టుకున్నారనే కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ఓ వైపు వీరప్పన్ భార్య విడుదల కానివ్వకుండా కోర్ట్ నోటీసుకులని పంపిస్తే.. వర్మ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా సినిమా విడుదలకు కావాల్సిన కార్యక్రమాలను చూస్తున్నాడు.
ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమా మీద భారీ అంచనాలు కలిగేలా చేసిన వర్మ ట్రైలర్ తో కూడా సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని కలిగించాడు. అందుకే సినిమా వ్యాపారం కూడా బాగా జరుగుతుందని తెలుస్తుంది. అయితే సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ఎంతకు కొన్నారో తెలియదు కాని సినిమా శాటిలైట్ రైట్స్ మాత్రం భారీ రేటు పలికాయని ఫిల్మ్ నగర్ టాక్. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ వారు పెద్ద మొత్తంలోనే ఈ సినిమా శాటిలైట్ హక్కులను పొందారట.
తెలుస్తున్న సమాచారం ప్రకారం దాదాపు 3.50 కోట్లకు కిల్లింగ్ వీరప్పన్ ని దక్కించుకున్నారట ప్రముఖ ఛానెల్ వారు. చూస్తుంటే కిల్లింగ్ వీరప్పన్ సినిమా వర్మకు మంచి లాభాలను తెచ్చిపెట్టేట్టే ఉంది. సినిమా తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో డిసెంబర్ 4న విడుదల అవుతుంది.