గత ఏడాది ఏప్రిల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికాలో పర్యటించారు. ఆ సందర్భంగా ప్రపంచం మొత్తం ఆకలి తీర్చడానికి ఇండియా రెడీగా ఉందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు గొప్పగా చెప్పారు. ఆ స్థాయిలో మా దగ్గర ఆహార నిల్వలు ఉన్నాయని చెప్పడం ప్రధాని ఉద్దేశం. అయితే ఖచ్చితంగా ఏడాది తిరిగే సరికి.. విదేశాల్లో ఉన్న భారతీయులకు కూడా బియ్యం కొరత సృష్టించేలా ఎగుమతుల్ని నిషేధిచింది కేంద్రం. ఒక్క ఏడాదిలోన అంత భారీగా ఆహారధాన్యాల నిల్వలు తగ్గిపోయాయా ? ఎలా సాధ్యం అంటే.. లెక్కలన్నీ బయట పెట్టాల్సిందే. కానీ చెప్పే లెక్కలకు వాస్తవాలకు పొంతన ఉండటం లేదనేది తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
దేశంలో బియ్యం కొరత అనేది రాకూడదు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధికంగా వరి సాగు చేసేదేశాల్లో భారత్ మొదట ఉంటుంది. ఎంత కావాలంటే అంత ఎగుమతి చేసుకోవచ్చు. కానీ ఎగుమతులు ఆపేయాల్సినంత కొరత ఎందుకు వచ్చింది. ఈ ఏడాది పంటలు ఆలస్యమయ్యాయి… కానీ ఆ ప్రభావం వచ్చే ఏడాది కనిపిస్తుందేమో.. ఇప్పుడే ఎందుకు బియ్యం ఎగుమతులపై నిషేధం విధించారన్నది అంతుబట్టని విషయమే. ముందు జాగ్రత్తగా బియ్యం రేట్లను కంట్రోల్ చేయడానికి ఇలా చేశామని కేంద్రం చెబుతోంది.
కారణం ఏదైనా ఏ ప్రభుత్వం అయినా నిర్ణయాలు తీసుకునే ముందు పర్యవసానాలు ఆలోచించి… ఎక్కువ మంది ఎఫెక్ట్ కాకుంండా నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే బియ్యం నిర్ణయంంలాగే అవుతుంది. సరైన అవగాహన లేకుండా బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడం వల్ల అమెరికాలో ఎన్నారైలు కంగారుపడిపోయారు. అయినా మన పాలకులు మతి లేని వాళ్లయితే.. ఆకలి భయం ఏ దేశంలో అయినా తప్పదు మరి !