జాతీయంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్లాగే రాష్ట్రాల స్థాయిలో తాను ో సంస్కరణల పితామహుడినని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తుంటారు. ఆ రోజుల్లో ప్రపంచ బ్యాంకు ఆయనను గుర్తించి ప్రపంచ స్వప్న మంత్రివర్గంలో చోటు కల్పిండచం కూడా అభిమానులకు అమితానందం కలిగించింది. చాలా కాలం తర్వాత ఈ వాస్తవాన్ని అమెరికా మేధావి ఒకరు ప్రస్తావించారు. జిఎస్టి బిల్లు ఆమోదంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల ి బిల్లులు మోడి ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలకు పూర్తిగా కట్టుబడి ఉందని రుజువవుతున్నట్లు అమెరికా- ఇండియా విధాన అంశాల అధ్యయన కేంద్రం ప్రతినిధి రిచర్డ్ ఎం రోసో వ్యాఖ్యానించారు. రాష్ట్రాలను కూడా రంగంలోకి దించకపోతే సరళీకరణ పూర్తి కాదని అంటారు. 1997, 1999 సంవత్సరాల్లో ఈ దిశగా చర్యలు తీసుకున్నా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, కర్నాటకలో ఎస్ఎం కృష్ణ ( కేంద్రంలో వాజ్పారు) వంటి వారు ఓడిపోవడం వల్ల ఆ క్రమం వెనక్కు పోయిందట. ఆ రీత్యా మోడి ప్రభుత్వం ఏం చేస్తుందోనని సందేహాలు ఉన్నా ఆచరణలో అవన్నీ తొలగిపోయాయని రిచర్డ్ కితాబు ఇచ్చారు. 98 అంశాలతో కూడిన ప్రశ్నావళి ప్రకారం . ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ( సులభంగా వ్యాపారం) అంచనాలలో ముందుండాలని రాష్ట్రాలు పోటీ పడే పరిస్థితి ఏర్పడింది. ఎపి తెలంగాణ కూడా ఈ విషయంలో బహిరంగంగా వివాద పడటం తెలిసిన విషయమే. అదలా వుంచితే తన వాదనకు మద్దతుగా రిచర్డ్ అనేక రాష్ట్ర స్థాయి సంస్కరణలను ప్రస్థావించారు.
- 2016 గుజరాత్ భూసేకరణ చట్టం సామాజిక ప్రభావం అంచనాను, మరికొన్ని పునరావస పథకాలను తొలగించింది.
- 2016 మహారాష్ట్ర భూ రెవెన్యూ నిబంధనలు ప్రభుత్వ భూములను లీజుకు ఇవ్వడం గాక మొత్తంగా తెగనమ్మే వీలు కల్పించాయి.
- 2015 మహారాష్ట్ర గుంత్వేరి చట్టం చిన్నతరహా ప్లాట్లను కూడా విభజించి అమ్ముకునే అవకాశమిచ్చింది.
- 2015 ఆంధ్రప్రదేశ్ బిల్లు ప్రయివేటు సంస్థలకు ప్రభుత్వ భూముల లీజు వ్యవధిని 33 ఏళ్ల నుంచి 99 ఏళ్ల వరకు పెంచింది.
- 2016 రాజస్థాన్ పట్టణ భూ బిల్లు కొనుగోలుదారులకు టైటిల్ డిడ్ గ్యారెంటీ చేసింది.
- 2016 యూపి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టార్టప్ విధానం ప్రకారం కార్యాలయాల కోసం తీసుకున్న భూములపై పన్నులను, విద్యుత్ చార్జీలను ఐదేళ్ల పాటు మినహాయించింది.
- 2015 యూపి రెవెన్యూ నిబంధనల సవరణ ఆర్డినెన్స్ 3.5 ఎకరాలలోపు భూమి కలిగిన దళితుల నుంచి కూడా భూములు కొనుక్కునేందుకు అనుమతినిచ్చింది.
- 2015 గుజరాత్ కార్మిక చట్టం సమ్మెలు చేయడాన్ని జఠిలం చేసింది. కాంట్రాక్టు ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి చేసే అవకాశాలను కుదించివేసింది.
- 2016 కర్నాటక చిల్లర వాణిజ్య విధానం షాపులు రాత్రి వేళ కూడా తెరచి ఉంచడానికి ఎక్కువ స్టాక్ పెట్టుకోవడానికి అనుమతిచ్చింది. మహిళలతో రాత్రి వేళ కూడా పనిచేయించుకోవచ్చని ప్రకటించింది.
నిజానికి ఆయన ప్రస్థావించన మరింత కర్కష శాసనాలు కూడా మనకు తెలుసు. అన్నీ వ్యాపార, పారిశ్రామిక , కుబేరుల కోణం నుంచి తప్ప ప్రజల కోణం ముఖ్యం కాదు. అది కితాబో కాదో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి