`మా` ఎన్నికల పరంపరలో చివరి ఘట్టానికి చేరుకున్నాం. ఈరోజే పోలింగ్. ప్రచారం ప్రక్రియ ఎంత రసవత్తరంగా సాగిందో, క్లైమాక్స్ లోనూ… అంతే రగడ జరుగుతోంది. పోలింగ్ బూతు దగ్గర ప్రచారం చేస్తున్నారు, రిగ్గింగ్ జరుపుతున్నారంటూ.. అటు ప్రకాష్ రాజ్ వర్గం, ఇటు విష్ణు వర్గం రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. నటులు సమీర్, శివ బాలాజీ ఇద్దరూ పోలింగ్ జరుగుతున్న ప్రదేశంలో సైతం.. ప్రచారం చేస్తున్నారని, పామ్ ప్లేట్లు పంచుతున్నారని ఫిర్యాదులు అందాయి. అంతేకాదు.. ఒకరి పేరుతో మరొకరు వచ్చి, ఓటింగ్ వేస్తున్నారని ఇరు వర్గాలూ ఫిర్యాదు చేశాయి.
పోలింగ్ ప్రదేశంలో ప్రచారం చేయకూడదంటూ.. రిటర్నింగ్ అధికారులు సమీర్, శివ బాలాజీలకు సూచించారు. మరోసారి.. ఇదే పునరావతృం అయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. `మా`లో దాదాపు 900 మంది సభ్యులున్నారు. అందులో కొంతమందిని నటులు పాపులర్ కాదు. వాళ్లని గుర్తు పట్టడం కష్టం. ఆ పేరుతో మరొకరు వచ్చి, ఓట్లేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై పోలింగ్ కేంద్రంలో ఉన్న మోహన్ బాబు కాస్త అసహనం వ్యక్తం చేశారు.