మార్కెట్ స్లంప్లో ఉన్నప్పుడే తెలివిగా పెట్టుబడి పెట్టేవారు భారీగా వెనకేసుకుంటారు. స్టాక్ మార్కెట్ అయినా రియల్ ఎస్టేట్ అయినా అంతే. ఇప్పుడు హైదరాబాద్ రియాలిటీ కరెక్షన్ లో ఉంది. ఇళ్లు రెడీగా ఉన్నాయి. ధరలు నిలకడగా ఉన్నాయి. బేరం ఆడితే బిల్డర్లు తగ్గించే అవకాశాలుకూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఇల్లు కొనడం సరైన నిర్ణయంగా రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్ శివార్లలో కనిష్టంగా అపార్ట్మెంట్స్లో డబుల్ బెడ్ రూం ప్లాట్ ధర 40 లక్షల రూపాయలకు లభిస్తున్నాయి. త్రిపుల్ బెడ్ రూం ఫ్లాట్ 50 లక్షల రూపాయల వరకూ ఉంటోంది. అంటే ఎస్ఎఫ్టీ మూడున్నర వేల నుంచి నాలుగున్నర వేల వరకూ పడుతోంది. శివారు నుంచి కాస్త లోపలికి అయితే ఇంటి ధరలు మరి కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఉప్పల్, ఎల్బీనగర్, బీఎన్ రెడ్డి నగర్, నాగోల్, పటాన్ చెరు, శంషాబాద్, జీడిమెట్ల వంటి ప్రాంతాల్లో ఇంటి ధరలు గత ఏడాదిగా నిలకడగా ఉన్నాయి. పెరగలేదు. అంటే తగ్గినట్లే. యాభై లక్షలకు డబుల్ బెడ్ రూం అపార్టుమెంట్ వస్తోంది.
బడా రియల్ ఎస్టేట్ సంస్థలు నిర్మిస్తున్నప్రాజెక్టుల్లో కళ్లు తిరిగే ధరలు ఉంటున్నా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా చిన్న చిన్న బిల్డర్లు, మేస్త్రీలు నిర్మించే ఇళ్లనే ఎక్కువగా కొంటున్నారు. మాములుగా అయితే ఇంటి ధరలు ఈ సీజన్ లో పెరగాల్సి ఉంది. కానీ హైదరాబాద్ లో మధ్యతరగతికి ప్రజలకు దూరంగా రియల్టర్లు లగ్జరీ ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దాంతో హైడ్రా పై క్లారిటీ రావాల్సి ఉంది. నగర శివార్లలోనూ మౌళిక వసతులు బాగా మెరుగయ్యాయి.
ప్రభుత్వం ఇప్పటికే చెరవుల ఎఫ్టీఎల్ గురించి ప్రాథమిక నివేదిక రెడీచేసింది. వాటిలో ఉన్న వాటిని తప్ప ఇతర ఇళ్లను నిరభ్యంతరంగా కొనుగోలు చేస్తే… పెరిగే ధరల నుంచి బయటపడవచ్చు.