రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రక్షాళన చేసి.. మొత్తం హైదరాబాద్ ను ట్రాక్ లో పెట్టేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం కారణంగా .. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్తబ్దత ఏర్పడింది. కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీలు తగ్గిపోయాయి. కానీ మధ్యతరగతి ఇళ్ల కొనుగోలుదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊహించనంత మేలు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అమ్మకాలు ఆగిపోవడంతో బిల్డర్లు తమ లాభాలను తగ్గించుకుని అయినా ఉన్న ఇళ్లను అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు. బిల్డర్లకు తాము పెట్టిన పెట్టుబడికి వడ్డీ పెరిగిపోతుంది. అది నష్టం చేస్తుంది. అందుకే ఆటోమెటిగ్గా బిల్డర్లు తక్కువ రేటుకు ఫ్లాట్లను విక్రయిస్తారు.
గత మూడు నెలల్నుంచి కొందరు డెవలపర్లు పది నుంచి పదిహేను శాతం తక్కువకు ఫ్లాట్లను అమ్ముతున్నారని రియల్ ఎస్టే వర్గాలు చెబుతున్నాయ. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. అధిక శాతం మంది బిల్డర్లకు ఫ్లాట్ల అమ్మకాలు జరగట్లేదు. అందరూ వేచి చూద్దామనే భావనలో ఉననారు. ఇదే ట్రెండ్ మరో రెండు మూడు నెలలు కొనసాగితే.. బిల్డర్లు తప్పదన్నట్లు మరింత రేటు తగ్గించక తప్పదు. మనీ రొటేషన్ కోసమైనా బిల్డర్లు ధర తగ్గిస్తారని.. వారు బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలకు చేయాల్సిన పేమెంట్స్ చేయకపోతే.. వారి ఆస్తుల్ని ఎన్పీఏలుగా ప్రకటించే అవకాశం ఉంది.
హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గేది లేదంటున్నారు. వచ్చే మూడు నాలుగు నెలులు కీలకం. అంటే ఇప్పటికే అందుబాటులో ఉన్న లక్ష ఇళ్లను మార్కెట్ రేటుకంటే తక్కువకే ఫ్లాట్లు అమ్మకానికి వస్తాయి. ఇది మధ్యతరగతి ప్రజలకు ఎంతో లాభిస్తుంది. ఎవరూ భరించలేనంతగా పెరిగిపోతున్న ఇళ్ల ధరలకు ఇలా అయినా అడ్డుకట్ట పడినందుకు మధ్యతరగతి ప్రజలు రేవంత్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే.