బాబు బంగారం తరవాత వెంకటేష్ ఏమాత్రం గ్యాప్ తీసుకోవడం లేదు. వెంటనే మరో సినిమాని పట్టాలెక్కించేయడానికి రెడీ అయిపోతున్నాడు. మాధవన్ నటించిన హిందీ చిత్రం సాలాఖుద్దీస్ని తెలుగులో వెంకీ రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఖుద్దూస్ దర్శకురాలు.. సుధా కె.ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగులోనూ టేకప్ చేస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ కూడా ఫిక్సయిపోయింది. ఖుద్దూస్లో నటించిన రితినా సింగ్నే రీమేక్‌లోనూ కథానాయికగా తీసుకొన్నార్ట. ఇందులో వెంకీ బాక్సింగ్ కోచ్‌గా కనిపించనున్నాడు. క్రీడా నేపథ్యంలో సాగే సినిమాలో వెంకీ నటించడం ఇదే ప్రధమం. వసంతంలో క్రికెటర్‌గా కనిపించినా… అదో సబ్ ఫ్లాట్ మాత్రమే. సురేష్ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెలలో సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశాలున్నాయి. హిందీలో ఈ సినిమా పెద్ద హిట్టేం కాదు. ఓ మోస్తరుగా ఆడింది. కేవలం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఓ సినిమా చేయాలని వెంకీ పట్టుపట్టడం వల్ల ఈ రీమేక్ కార్యరూపం దాల్చబోతోంది. కథలో పెద్దగా మార్పులూ చేర్పులూ లేకుండానే పట్టాలెక్కించేస్తార్ట. మూడు నెలలలో చిత్రీకరణ పూర్తి చేయాలన్నది సురేష్ బాబు ఆలోచన. అందుకు తగ్గట్టే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా ముగించారు. ఇక సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యం.