పెళ్లిచూపులు సినిమాతో మంచి నటిగా పేరు తెచ్చుకుంది రీతూ వర్మ. తన ప్రయాణం కూడా మంచి పాత్రల వున్న సినిమాలతోనే సాగుతోంది. కథ, అందులోని తన పాత్ర నచ్చితేనే సినిమాకి సంతకం చేస్తుంది. అయితే ఇప్పుడో మాస్ ప్రయత్నం చేస్తోంది రీతు. సందీప్ కిషన్ త్రినాధ్ రావు నక్కిన కాంబినేషన్ లో వస్తున్న సినిమా మాజాకా. ఇందులో రీతూ వర్మ హీరోయిన్. ఈ కథ రీతుకి విభిన్నమైన ఎంపికే. త్రినాధ్ రావ్ సినిమాలు ఎలా ఉంటాయో ఓ ఐడియా వుంది. పైగా ఆయన ధమాక తర్వాత తీసుకున్న సినిమా ఇది. ధమాకా మీటర్ లో వుండే అవకాశం వుందని టీజర్ చూస్తే అర్ధమౌతోంది.
ఇందులో రెండు మాస్ సాంగ్స్ వున్నాయి. నిన్న రావులమ్మ అనే పాటని లైవ్ లో షూటింగ్ చూపించి ఓ కొత్త ప్రయత్నం చేశారు. ఈ రోజు పగిలి అనే పాటని రిలీజ్ చేశారు. ఇది కంప్లీట్ మాస్ నెంబర్. ఇలాంటి పాటలు సందీప్ కి కొత్త కాదు కానీ రీతూకి మాత్రం కొత్త. గతంలో దిగుదిగుదిగు నాగ పాట చేసిన అనుభవం రీతుకి వుంది. అయితే ఆ పాట లిరిక్స్ హైలెట్ అయినంతగా రీతు డ్యాన్స్ కాలేదు. ఇప్పుడు మజాకాతో మరో డ్యాన్స్ ప్రయత్నం చేస్తోంది. లిరిక్ వీడియోలో మాస్ స్టెప్పులు బాగానే వున్నాయి. పైగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కాబట్టి ఏవో సిగ్నేచర్ మూమెంట్స్ వుండే అవకాశం వుంది. అలాగే రావులమ్మ పాట కూడా మాస్ ఫోక్ నెంబర్. ఈ రెండు పాటల్లో రీతూ డ్యాన్స్ ఆకట్టుకుంటే భవిష్యత్ మరిన్ని కమర్షియల్ సినిమాలు ఆమె ఖాతాలో పడే ఛాన్స్ వుంది.