న్యాయవ్యవస్థపై జగన్ చేస్తున్న దాడిని తనదైన శైలిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు… ఆంధ్రజ్యోతి ఆర్కే చేస్తున్న ప్రయత్నానికి మాజీ హైకోర్టు న్యాయమూర్తి ఈశ్వరయ్య ఆయుధాన్ని అందించారు. జస్టిస్ నరసింహారెడ్డిపై పోరాటం చేస్తున్న దళిత జడ్జి రామకృష్ణను అడ్డం పెట్టుకుని… సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేసి.. బ్లాక్మెయిల్ చేసే కుట్రకు తెరలేపారని.. ఆర్కే చెబుతున్నారు. దానికి సాక్ష్యంగా ఆడియో టేపులు రిలీజ్ చేశారు. ఉత్తినే టేపులంటే… ఖండిస్తారు కాబట్టి.. ముందుగానే ట్రూత్ ల్యాబ్‌ల్లో టెస్టులు చేయించి.. ఆయనవే అని నిర్ధారించుకుని మరీ ప్రసారం చేశారు. ఆ టేపులను రామకృష్ణ హైకోర్టులో కూడా సమర్పించారు. అది వేరే విషయం.
ఇప్పుడు ఈశ్వరయ్యకు.. న్యాయవ్యవస్థపై దాడి చేయాల్సిన అవసరం ఏమిటి..? అన్న కోణంలో… వేమూరి రాధాకృష్ణ తన ఆపరేషన్ ప్రారంభించారు. ఈ వారం కొత్త పలుకులో అదే హైలెట్. జగన్మోహన్ రెడ్డి కోసమే.. ఈశ్వరయ్య.. కులాలను అడ్డం పెట్టుకుని.. తాను ఎదిగిన వ్యవస్థనే… వంచించడం ప్రారంభించారని ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆటలో పావుగా మారి… ఈశ్వరయ్య… అంతా చేస్తున్నారని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తన కేసులో శిక్షలు పడకుండా… తాను తీసుకుంటున్న నిర్ణయాలకు అడ్డురాకుండా.. రాజకీయాల్లో ఇతర నేతలపై చేస్తున్న మానసిక దాడి తరహాలోనే.. న్యాయవ్యవస్థపైనా కుట్ర చేస్తున్నారని ఆర్కే విశ్లేషిస్తున్నారు.
ఈశ్వరయ్య ఏ ఉద్దేశంతో రామకృష్ణను పావుగా వాడి.. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో ఆరోపణలు చేయించాలనుకున్నారో కానీ… ఇప్పుడు ఆయన చేసిన పని జగన్ మెడకు చుట్టేందుకు ఆర్కే ప్రయత్నిస్తున్నారు. ఇది న్యాయవ్యవస్థపై జరిగిన కుట్ర. తమ విశ్వసనీయతకు భంగం కలిగేలా చేస్తే… ఏ వ్యవస్థ కూడా.. సింపుల్‌గా తీసుకోలేదు. సీరియస్‌గానే తీసుకుంటుంది. ప్రస్తుతం… ఈశ్వరయ్య పెట్టిన కుల సంఘం వేస్తున్న పిటిషన్లు.. ఆయన దురుద్దేశాలతో పాటు.. రామకృష్ణ తో మాట్లాడిన ఆడియో టేపు కూడా కోర్టుకు చేరింది. దీంతో.. కోర్టు విచారణకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని.. ఒక వేళ సీబీఐ విచారణకు ఆదేశిస్తే.. ఈశ్వరయ్య పరిస్థితి ఏమిటని.. ఆర్కే చెబుతున్నారు.
మొత్తం వ్యవహారం చూస్తూంటే.. న్యాయవ్యవస్థను టార్గెట్ చేసేందుకు ఓ పక్కా స్కెచ్ ఉందని మాత్రం అర్థం అవుతోందని ఆర్కే తన కొత్తపలుకులో అంతిమంగా తాత్పర్యంలాగా చెప్పారు. ఈ కుట్ర వెనుక జగన్ ఉన్నారా..? లేదా..? అన్నది .., ఈశ్వరయ్య బయటపెట్టి.. ఆయన బయటపడాలని.. లేకపోతే.. తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారన్న ఓ రకమైన ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కూడా ఉంది. మొత్తానికి ఆర్కేకు ఈశ్వరయ్య టేపులతో దొరికారు. మరి ఈశ్వరయ్య ఎలా స్పందిస్తారో..?