సొంత కుటుంబమూ ఈసడించుకునే పాలన ఓ పాలనేనా ? అని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సీఎం జగన్ పాలనపై తన అభిప్రాయాన్ని ఒక్క ముక్కలో చెప్పారు. ఆయన పాలననూ అందరూ అసహ్యించుకుంటున్నారని చివరికి సొంత కుటుంబం కూడా అన విషయాన్ని ఆయన ఒక్క మాటతో చెప్పిటన్లయింది. అయితే ఫినిషింగ్ టచ్‌గా ఇచ్చిన ఈ వాక్యానికి ముందు ఆయన జగన్ పాలన .. కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లుగా ఎలా సాగుతుందో వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వైఎస్ వివేకా హత్య కేసులో కళ్ల ముందు అన్నీ కనిపిస్తున్నా… వైఎస్ అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ వివేకా సొంత కూతురుపై నిందలేయడానికి ఏ మాత్రం వెనుకాడని జగన్ నైజాన్ని ఆర్కే వీలైనంత ఎక్కువగా తన ఆర్టికల్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు.
సీబీఐ మీద సైతం కేసులు పెట్టే స్థాయికి వెళ్లిపోయిన జగన్మోహన్ రెడ్డి ఇంత కాలం సీబీఐ కేసుల్లో విచారణ జరగకుండా అడ్డుకోవడావడానికి వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఉంటారని ఆర్కే అనుకుమానం., బలమైన శక్తి మద్దతు లేకపోతే ఆయన బయట ఉండటం కష్టమని ఆర్కే అభిప్రాయం. అది నిజమేనని అనిపించడానికి ఏళ్ల తరబడి జైల్లో ఉంటున్న లాలూ .. వరుసగా శిక్షలకు గురువుతున్న వైనాన్నీ వివరించారు. వైఎస్ వివేకా హత్య కేసులో అన్ని వేళ్లూ అవినాష్ రెడ్డి వైపు చూపిస్తున్నప్పటికీ జగన్‌కుచెందిన మీడియా మాత్రం వివేకా కూతురు, అల్లుడిపై నిందలేయడానికి అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని తనదైన శైలిలో ఆర్కే విశ్లేషించారు.
ఇక భీమ్లా నాయక్ విషయంలో జగన్మోహన్ రెడ్డి శైలి సైకోను తలపిస్తోందని పరోక్షంగా ఆర్కే చెప్పారు.ఇతరులను ఇబ్బంది పెట్టి.. వారు కష్టపడుతూంటే తాను సంతోషపడే నైజం జగన్‌దని ఆయన తేల్చేశారు. భీమ్లా నాయక్ సినిమా కలెక్షన్లను నియంత్రించడం వంటి చిల్లల విషయాలపై దృష్టి పెట్టి.. రాష్ట్రాన్ని గాలికొదిలేసిన దౌర్భాగ్యం కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. హైదరాబాద్ విదేశీ నగరాలకు ధీటుగా అభివృద్ధి చెందుతూంటే… ఏపీ మాత్రం అప్పుల కుప్పగా మారి దిగజారిపోతోందన్నారు.
ఈ వారం తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదోమో కానీ.., మొత్తం జగన్‌పైనే దృష్టి కేంద్రీకరించారు. ఎన్ని సార్లు ఆర్టికల్స్ రాసినా మళ్లీ కొత్తగా రాయగలిగేలా జగన్ పాలన ద్వారా విషయాన్ని ఆర్కే గ్రహిస్తున్నారు. అయితే ఆయన చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇదేలా సాధ్యం అనిపించేలా రాస్తారు.. ఎక్కువ సార్లు నిజమే కదా అనిపిస్తతారు. ఈ వారం ఆర్టికల్ కూడా జగన్.. ఎందుకు వివేకా కూతుర్ని వెంటాడుతున్నారన్న అనుమానం ప్రజల్లో మరింత బలపడేలా చేయగలిగారని అనుకోవచ్చు.