కొండా సురేఖ వివాదం నుంచి ఎలా బయటపడాలో ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే రేవంత్ రెడ్డికి సూటిగా, సుత్తి లేకుండా సలహా పంపించారు. అదేమిటంటే.. కొండాసురేఖతో నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పించడం. అలా జరిగితే మొత్తం సెటిల్ అయిపోతుందని …ఇక రాజకీయ వివాదం ఉండదని ఆయన అంటున్నారు. అంతే కాదు.. తప్పు చేసినప్పుడు ఇలా క్షమాపణలు చెప్పడం కూడా తప్పేం కాదని ఆయన అంటున్నారు. మాటలు వెనక్కి తీసుకోవడం సరి పోదని ఆర్కే తేల్చేశారు. వారాంతపు ఆర్టికల్ కొత్త పలుకులో తన సలహా..దానికి జస్టిఫికేషన్ ఇవ్వడానికే ఎక్కువ సమయం కేటాయించారు.
సురేఖ వ్యవహారంతో బీఆర్ఎస్కు కేసీఆర్‌కు లాభం కలుగుతుందని అందుకే క్షమాపణ చెప్పాలంటున్నారు. కానీ రాజకీయాల్లో తాము ఎంచుకున్న స్టాండ్ విషయంలో.. ఇంత రచ్చ జరిగిన తర్వాత తప్పయిపోయింది క్షమించండి అని అడిగితే అది వారి రాజకీయ జీవితానికి పెను ప్రమాదంగా మారుతుంది. భవిష్యత్‌పై ఆమె ఏం మాట్లాటినా తప్పు పట్టే వారు బయలుదేరుతారు. అందుకే కొండాసురేఖ తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నారుకానీ వెనక్కి తీసుకున్నానని గందరగోళ ప్రకటనలు చేస్తున్నారు. ఆమె రాజకీయం ఆమె చేస్తున్నారు.
కొండా సురేఖ ఇష్యూ వల్ల కాంగ్రెస్ నష్టపోతుందా… లాభపడుతుందా అనేది అసలు సందర్భం లేని టాపిక్. ఇలా ప్రతీ అంశాన్ని ప్రజలు బేరీజు వేసుకునే అవకాశం ఉండదు. అయితే ప్రతి ఒక్కరూ ఏపీలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరును గుర్తు చేసుకున్నారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని సలహాలు ఇచ్చారు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ సహనం కోల్పోయారు కనీ.. బీఆర్ఎస్ నేతలే ఎక్కువ మంది నోటి దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిన వెంటనే… ఆమె ఆడియో ఒకటి క్రిషాంక్ లీక్ చేశారు. మరి అది బీఆర్ఎస్కు నష్టం చేయదా అంటే.. కొండా సురేఖను తప్పు పట్టే చాన్స్ వచ్చింది కాబట్టి మిగతా ఇంకేమీ అవసరం లేదన్నట్లుగా ట్రెండింగ్ జరిగిపోయింది. ఆ దారిలోనే ఆర్కే వెళ్లిపోయారు.
నాగార్జున విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పర్టిక్యులర్ గా ఉంది. బీఆర్ఎస్,కేటీఆర్ తో కలిసి ఆయన కాంగ్రెస్ పై కుట్రలు చేయడం.. వాటిలో పాలు పంచుకోవడం వంటివి ఏమైనా చేసినట్లుగా సమాచారం ఉందేమో కానీ.. నాగార్జున పరోక్ష రాజకీయాల్లో బలంగా పాలు పంచుకున్నారని ఎక్కువమంది నమ్ముతారు. ముఖ్యంగా డబ్బు పంపిణీకి ఆయన ఓ టూల్ గా ఉపయోగపడ్డారని అంటారు. ఏదైనా… కొండాసురేఖ ఇష్యూలో రేవంత్ రెడ్డికి ఓ సలహా పంపారు ఆర్కే. మరి కాంగ్రెస్ పాటిస్తుందా ?