అయ్యవారి అసలు రూపం తనను ఎవరూ చూడటం లేదని అనుకున్నప్పుడే బయటపడుతుందనే నానుడి ఉంది. అందరి ముందు ఒకలా.. ఎవరూ లేనప్పుడు మరోలా మనుషులు వ్యవహరిస్తూ ఉంటారు. ఇలాంటి వారిలో విపరీత పోకడలు ఉన్న వారుంటారు. జగన్ కూడా అలాంటి వారేనని ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ నేరుగా చెబుతున్నారు. అధికారం లేనప్పుడు దాన్ని అందుకోవడానికి అందర్నీ వాడేసుకున్న జగన్.. అధికారం అందిన తర్వాత వారెక్కడ వాటా అడుగుతారోనన్న భయంతో అందర్నీ గెంటేశారంటున్నారు. దానికి తాజా సాక్ష్యం తల్లి విజయలక్ష్మి.
వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా విజయలక్ష్మి రాజీనామా చేయడం వెనుక జగన్నాటకం ఉందని ఆర్కే విశ్లేషణ. తను జైలుకెళ్లక తప్పదని జగన్ గట్టిగా భావిస్తున్నారట. అలా వెళ్లినప్పుడు పార్టీ తన భార్య చేతుల్లోనే ఉండాలి కానీ తల్లి, చెల్లి చేతుల్లోకి వెళ్లకూడదని ఆయన అనుకుంటున్నారు. అందుకే వారిద్దరినీ రాష్ట్రం నుంచి గెంటేశారని చెబుతున్నారు. ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను చూస్తే ఇదే నిజం అని అనుకోక తప్పదు. అవసరమైనప్పుడు కనిపించడం తప్ప ఎప్పుడూ పార్టీలో కనిపించని విజయమ్మతో రాజీనామా చేయించాల్సిన అవసరం ఏంటో వైసీపీ కార్యకర్తలకూ అర్థం కావడం లేదు.
ఇప్పుడు సునీతను టార్గెట్ చేసి అసెంబ్లీ సీటు ఆఫర్ అంటూ ప్రచారం చేస్తున్నారని ఇదంతా ఆమె క్యారెక్టర్‌ను కించ పర్చడానికేనని .. చివరికి ఆమెకు ఎటువంటి న్యాయం చేయకగా… దారుణ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్కే చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అందర్నీ దూరం చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆయన ఒక్కడే ఉన్నారు. మిగిలిన వారందరూ దూరమయ్యారు. ఆర్కే తన ఆర్టికల్స్‌లో అంతర్గతంగా కొన్ని విషయాలను చదివేవాళ్లలో చొప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. జగన్ అప్రజాస్వామిక వాది అని.. దయాదాక్షిణ్యాలు ఉండవని .. పేదలనూ వాడుకుని రాజకీయం చేస్తారు .. వారిని మరింత నిరుపేదలకు గాచేస్తారన్న విషయాన్ని పరోక్షంగా చెబుతూంటారు. ఈ సారి కూడా అ ఫ్లేవర్ మిస్ కాలేదు.
అయితే ఎప్పుడూ బీజేపీ పెద్దలు కొన్ని అవసరాల కోసం ఆయనను వాడుకుంటున్నారని.. చెప్పినవేవీ చేయరని.. అంటూ ఉంటారు. ఈ సారి కూడా అదే చెప్పారు. బీజేపీ పెద్దలు ఆయనను కేసుల నుంచి తప్పించేందుకు సిద్ధంగా లేరని.. తమ పార్టీని కబళించే ప్లాన్ అమలు చేస్తారని జగన్ గట్టిగా నమ్ముతున్నట్లుగా చెబుతున్నారు. ఆ భయంతోనే ఆగిపోయినట్లుగా ఆర్కే విశ్లేషించారు. మొత్తానికి ఆర్కే పలుకులో జగన్‌కు బీజేపీ గట్టి సపోర్ట్ ఉందని తేల్చారు.