రోజా గుళ్లకు వెళ్లేది రాజకీయాలు మాట్లాడటానికే అన్నట్లుగా మారిపోతోంది. ఏ గుడికిపోయిన అదే. గతంలో తిరుమలలో టిక్కెట్ల వ్యాపారం చేసినప్పుడు వారానికోసారి వీఐపీ దర్శనానికి వచ్చేవారు. ఇప్పుడు ఆమె ఎమ్మెల్యే కూడా కాదు కాబట్టి ఆమెకు కూడా వీఐపీ టిక్కెట్ దొరకడం కష్టం. అందుకే పెద్దగా తిరుమల వైపు రావడం లేదు. కానీ తమిళనాడు గుళ్లు మాత్రం తిరుగుతున్నారు.. అక్కడా రాజకీయాలే మాట్లాడుతున్నారు. కాకపోతే తెలుగు రాజకీయాలు మాట్లాడటమే విచిత్రం.
మధురమీనాక్షి ఆలయానికి దర్శనానికి వెళ్లారు రోజా. బయటకు వచ్చిన తర్వాత తమిళంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు మీద తిట్లందుకున్నారు. చంద్రబాబు షూస్ వేసుకుని పూజలు చేస్తారని.. పవన్ కల్యాణ్ భార్య క్రిస్టియన్ అని తెగ బాధపడిపోయారు. అందుకు సాక్ష్యంగా కొన్ని ఫోటోలు మీడియాకు చూపించారు. ఆమె ప్రయాస చూసి అక్కడి మీడియా ప్రతినిధులు కూడా పాపం అనుకున్నారు. ఎందుకంటే.. తమిళనాడులో చంద్రబాబు,. పవన్ కల్యాణ్‌ల పై తప్పుడు ప్రచారం చేసి ఏం సాధిస్తారో మరి.
చంద్రబాబుకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి. ఆయన ఎప్పుడూ సాక్సులు ఖచ్చితంగా ఉంచుకుంటారు. దన్నే షూలుగా ప్రచారం చేస్తున్నారు. పనన్ తన భార్య క్రిస్టియన్ అని ఎప్పుడూ దాచలేదు. అంతే కాదు..తాను క్రిస్టియానిటీని గౌరవిస్తాననే అంటారు. హిందూత్వాన్ని కించపర్చడం… సంప్రదాయాల్ని పాటించేది లేదని చెప్పడం క్రిస్టియానిటీ కాదు. ఇదే పవన్ చెప్పే సనాతనానికి… వైసీపీ నేతలు చేసే ఆచరణకు తేడా. వైసీపీ నేతలకు అర్థం కానిదేమిటంటే… కూటమి నేతలు కొట్టిన దెబ్బకు ఇతర రాష్ట్రాల్లోనూ … తాము తప్పు చేయలేదని. చెప్పుకోవాల్సి రావడం.