రోజా అంటేనే ఫైర్ బ్రాండ్. వివాదాస్పద అంశాలు.. అదీ కూడా సినిమా, రాజకీయం అంటే ఆమె ఎంట్రీ లేకుండా ఉండదు. అయికే కొద్ది రోజులుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల హడావుడి నడుస్తోంది. అందరూ రకరకాలుగా స్పందిస్తున్నారు. కానీ ఫైర్ బ్రాండ్ రోజా మాత్రం మిస్సయ్యారు. ఓటింగ్‌కు రెండు రోజుల ముందు ఆమె నోరు విప్పారు. మా ఎన్నికల విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోనని.. ఎలాంటి ప్రకటనలు కూడా చేయబోనని స్పష్టం చేశారు.
రోజా వైపు నుంచి ఇలాంటి ప్రకటన రావడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సినీ పరిశ్రమ విషయంలో అదీ కూడా…నటీ నటుల సంఘం విషయంలో ఆమె సైలెంట్‌గా ఉండటం కాస్త ఆసక్తికరమే . ఎవరి వైపు తీసుకోకపోవడం మరింత విచిత్రంగా చెప్పుకోవచ్చు. అయితే రోజా ఏం మాట్లాడినా ఆమె నటిగా మాత్రమే కాకుండా ఆమె ఉన్న పార్టీ వైసీపీ తరపు నుంచి కూడా చూస్తారు.
అదే సమయంలో ప్రభుత్వం .. మా ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ వైపు ఉండకపోవడమే మంచిదని భావించినట్లుగా తెలుస్తోంది. రోజా ఎవరి వైపు ఉండకపోవడం.. ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయకపోవడంతో.. మా ఎన్నికల వేడి మరో రేంజ్‌కు వెళ్లకుండా ఆగిపోయిందని అనుకోవచ్చు.