జగన్ రెడ్డి తాడేపల్లిలో రెండు ఎకరాల్లో బినామీ పేర్లతో ఇల్లు కట్టుకోవడం ఏమో కానీ అసలు రాష్ట్ర విభజనకు చాలా ఏళ్ల ముందే చిన్న చిన్న గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న వారు రోడ్డున పడాల్సి వస్తోంది. సీఎం జగన్ ఉండే తాడేపల్లి ప్యాలెస్ కాలువగట్టు పైన అమరారెడ్డి కాలనీ ఉండేది. అది కాలువగట్టు. కానీ పేదలు కాబట్టి ఇళ్లు కట్టుకున్నారని వారందరికీ గత ప్రభుత్వ కరెంట్, నీళ్లు వంటి సౌకర్యాలు కల్పించాయి.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక .. ఆయన అక్కడే ఓ రెండు ఎకరాలతో బినామీ పేర్లతో ఇల్లు కట్టించుకోవడంతో వారికి సమస్యలు వచ్చాయి. ఇప్పటికే సగం మంది ఇళ్లను కూలగొట్టించి తరిమేశారు. వారందిరికీ సెంటు స్థలం పట్టాలిచ్చారు. అవి ఎక్కడున్నాయో తెలియదు. వారంతా విజయవాడ, గుంటూరు, మంగళగిరి వంటి చోట్లకుపోయి చిన్న చిన్న గదుల్లో అద్దెకు ఉంటున్నారు. దాదాపుగా ఏడు వందల కుటుంబాలను అలా రోడ్డున పడేశారు.
ఇప్పటికే రోడ్డు విశాలంగా ఉంది. జగన్ రెడ్డి ఇంటి కోసం కనీసం వెయ్యి కోట్ల వరకూ ఖర్చు పెట్టి రోడ్లు.. సెక్యూిటీ సహా అనేక ఏర్పాట్లు చేసి ఉంటారు. అయితే ప్యాలెస్ నుంచి ఇంకా పేదల కాలనీ కనిపిస్తోందని మిగిలిన ఇళ్లనూ తొలగించేందుకు నోటీసులు ఇచ్చారు. అదేమంటే.. అది ప్రభుత్వ స్థలం అంటున్నారు. కాదని ఎవరన్నారు… నలభై ఏళ్ల నుంచి వారు అక్కడే ఉంటున్నారు.. ఇప్పుడే ఎందుకు తీసేస్తున్నారన్నది చెప్పాలి కదా. కనీసం వారికి ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వాలి కదా అంటే… సెంట్ స్థలాలిచ్చామని సమాధానం చెబుతున్నారు.
మొత్తంగా దాదాపుగా ఎనిమిది వందల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన నాలగేళ్లలో ఎంత మంది పేదలు రోడ్డున పడ్డారో.. మద్యంధరలు పెంచి, ఓటీఎస్ పేరుతో ఎలా పేదల రక్తం తాగారో అంతకన్నా ఘోరంగా ఈ పెత్తందారు పేదలపై దండెత్తుతున్నారు. వారిని ఎవరు కాపాడాలి ?