ఇండియన్ మైఖెల్ జాక్సన్ … ప్రభుదేవా. ఆ పేరుకి ఎప్పటికప్పుడు సార్థకత చేకూరుస్తూనే ఉంటాడు ప్రభుదేవా. దర్శకుడైపోయినా.. డాన్సర్‌గా ఆ జిల్ అలానే ఉంది. కాకపోతే.. దాన్ని బయట పెట్టుకొనే ఛాన్స్ ఎప్పుడో గానీ రావడం లేదు. అయితే ఇప్పుడు అభినేత్రిలో ప్రభుదేవా డాన్సులతో అదరగొట్టేశాడు. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ దర్శకుడు. అభినేత్రి టీజర్ కొద్ది సేపటి క్రితమే విడుదలైంది. ఇదేదో హారర్ సినిమా అని, భయపెట్టే కంటెంట్‌తో వస్తుందని అనుకొంటే.. ప్రభుదేవా తన డాన్స్ మేళా చూపించాడు. ఈ టీజర్లో ప్రభుదేవా స్టెప్పులు అదిరిపోయాయి.
సాధారణంగా డైలాగ్‌తో.. టీజర్‌ని ఎండ్ చేస్తుంటారు. కానీ ఇక్కడున్నది ప్రభుదేవా కదా, అందుకే ఓ క్లాసీ స్టెప్పుతో టీజర్‌ని కట్ చేశాడు. టీజర్ చూసినోళ్లంతా ప్రభుదేవా.. అదుర్స్ అంటున్నారు. తమన్నాదీ అదే మాట. ప్రభుదేవా కింగ్ ఆఫ్ డాన్స్కాదు.. గాడ్ ఆఫ్ డాన్స్ అంటూ కితాబులు ఇచ్చేస్తోంది. అభినేత్రిలో ప్రభేదేవా స్టెప్పు ఎవరు చూసినా అదే మాట చెప్తారు. మొత్తానికి ఇది ప్రభుదేవా మార్క్ టీజర్.. ఒక నిమిషం వ్యవధిలోనే ప్రభు ఇన్ని స్టెప్పులు వేశాడంటే.. సినిమాలో ఇంకెన్ని ఉంటాయో?