టెస్టులకు పనికి రాడంటూ… బలంగా వేసిన స్టాంప్‌ను… ోహిత్ శర్మ ఒక్క ఫటాఫట్ సెంచరీతో తుడిచి పెట్టేశాడు. ఎన్నో తర్జనభర్జనల తర్వాత టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకున్న రోహిత్ శర్మ… తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేసి.. తానెంత విలువైన ఆటగాడినో .. తేల్చి చెప్పారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో డకౌట్ కావడంతో.. రోహిత్ శర్మ.. టెస్టులకు పనికి రాడని.. మ్యాచ్ ప్రారంభానికి ముందే.. చాలా మంది జాతకం రాసేశారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ… తన జాతకాన్ని తానే తిరగరాసుకున్నాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టెస్టు టీములోనూ.. తాను పాతుకుపోగలనని నిరూపించాడు.
రోహిత్ శర్మ.. ధనాధన్ ఆటతీరు పరిమిత ఓవర్ల క్రికెట్‌కే సూటవుతుందని చాలా మంది నిపుణులు అంచనా వేశాదు. దానికి తగ్గట్లుగానే టెస్టు క్రికెట్లో అవకాశాలు తగ్గిపోయాయి. కానీ రోహిత్ శర్మ ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. పట్టుదలతో ప్రయత్నాలు చేశారు. జట్టులో తనకు వ్యతిరేకంగా ఓ గ్రూప్ ఉందని.. ప్రచారం జరిగినా… కొంత మంది నిరుత్సాహ పరుస్తున్నా… రోహిత్ ఎక్కడా.. తడబడలేదు. లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూండటంతో.. అడుగు ముందుకే వేశాడు. విశాఖ స్టేడియం… రోహిత్ శర్మకు.. జీవితాంతం గుర్తుండిపోతుంది.
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోందని వరల్డ్‌కప్ ముగిసినప్పటి నుంచి వార్తలు హల్చల్ చేశాయి. ఆ వార్తలపై విరాట్ కోహ్లీ స్పందించినా.. రోహిత్ శర్మ మాత్రం మౌనంగా ఉండిపోయాడు. ప్రపంచకప్‌లో ఐదు శతకాలు బాది సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మకి ఇటీవల ముగిసిన వెస్టిండీస్ పర్యటన టెస్ట్ సిరీస్‌లో తుది జట్టులో అవకాశం దక్కలేదు. రోహిత్ శర్మ లాంటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ రిజర్వ్ బెంచ్‌పై అలా కూర్చోవడం తనని బాధించిందని కొంత మంది ఆటగాళ్లు ట్వీట్లు కూడా చేశారు. రోహిత్‌తో విభేదాల కారణంగానే అతడ్ని టెస్టుల్లో పక్కన పెట్టినట్లు కెప్టెన్ కోహ్లీపై ఆరోపణలు వచ్చాయి. వీటి కారణంగా ఏమో కానీ.. దక్షిణాఫ్రికా సిరీస్‌లో తుది జటటులో అదీ ఓపెనర్‌గా చాన్స్ దొరికింది. వన్డే, టీ20ల్లో రెగ్యులర్ ఓపెనర్‌గా ఆడుతున్న రోహిత్ శర్మ.. టెస్టుల్లో మాత్రం ఇన్నాళ్లు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. దాంతో పెద్దగా క్లిక్ కాలేదు. తనకు అచ్చి వచ్చిన ఓపెనర్‌గా టెస్టుల్లోనూ పాతుకుపోయే అవకాశం కనిపిస్తోంది.