మంత్రి ఆర్కె రోజా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని సవాల్ చేస్తున్నారు. కానీ వైసీపీ నేతలెవరూ ఆమె వెంట రావడం లేదు. కుదిరిన వాళ్లు టీడీపీలో చేరిపోయారు. లేని వాళ్లు పరోక్షంగా సాయం చేస్తున్నరు. రోజాను గెలిపించేందుకు సహకరించే ప్రశ్నే లేదంటున్నారు. పేలవమైన నామినేషన్ ర్యాలీ తర్వాత నగరి నియోజకవర్గంపై వైసీపీ నేతలు ఆశలు వదిలేసుకున్నారు. సొంత నియోజకవర్గం వారు ఎవరూ ఉండరని తెలియడంతో మంత్రి పెద్దిరెడ్డి సహా ఎవరూ పట్టించుకునే చాన్స్ లేకపోవడంతో బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని ముఖ్య అహ్వానించి నామినేషన్ పని అయిపోయిందనిపించారు.
2014, 2019 ఎన్నికల్లో రోజా స్వల్ప మెజార్టీతోనే గట్టెక్కారు. 2014లో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడుతో తలపడ్డారు. 871 ఓట్ల తేడాతో హమ్మయ్యా అని బయటపడ్డారు. 2019లో ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్రెడ్డిపై పోటీచేసి 2,007 ఓట్లు తేడాతో గెలుపొందారు. రెండు సార్లు రోజా గెలుపునకు కృషి చేసిన రెడ్డివారి చక్రపాణిరెడ్డి, జడ్పిటిసి మురళీనాథరెడ్డి తమ సపోర్టు గాలి భానుప్రకాష్కే అని పరోక్షంగా ప్రకటించారు.
అమ్ములు, వెంకటముని, లక్ష్మిపతి అనే నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నగరి నియోజకవర్గంలో పుత్తూరు, నగరి, విజయపురం, వడమాలపేట, నిండ్ర మండలాలు ఉండగా, మంత్రి రోజాకు గత ఎన్నికల్లో వడమాలపేట, నిండ్ర ఓట్లే ఎక్కువ మెజార్టీని తెచ్చాయి. ఈ సారి అసమ్మతి సెగ ఈ మండలాల్లో ఎక్కువగా ఉంది. వారిని బుజ్జగించడం అసాధ్యమని తేలిపోవడంతో మొత్తం రోజాకు వదిలేసి.. హైకమండ్ ైట్ తీసుకుంటోంది.