రోజా వ్యాఖ్యలు రోజూ హైలెట్ అవుతున్నాయి. ఆమె వాడే భాష కొన్ని సార్లు అదుపు తప్పుతోంది. నిన్న ఒక టివి డెబేట్ లో పవన్ కళ్యాణ్ కి మద్దతు గా మాట్లాడుతున్న బండ్ల గణేష్ ని ఉద్దేశ్యించి చేసిన వ్యాఖ్యలపై కలకలం కొనసాగుతోంది. అయితే రోజా మరో మంత్రి మీసాల పై కూడా వ్యాఖ్యలు చేసారు.
చిత్తూరు జిల్లా కు చెందిన మంత్రి అమరనాదరెడ్డి పై రోజా విమర్శలు చేస్తూ – ” పార్టీ ఫిరాయించి మంత్రి అయిన అమరనాథరెడ్డి టీవీల్లో మీసాలు తిప్పడం కాదు సొంత జిల్లాలో ఓ పరిశ్రమనైనా నెలకొల్పారా? ” అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో అన్నివర్గాలకు బాధలు తప్పడం లేదని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందన్నారు. అవినీతిలో , అప్పుల్లో రాష్ట్రాన్ని చంద్రబాబు నంబర్ 1 చేశారని పత్రికలే చెబుతున్నాయని గుర్తుచేశారు.
అయితే పరిశ్రమలు నెలకొల్పలేకపొయాడని మంత్రి ని విమర్శించడం లో ఏ మాత్రం తప్పు లేనప్పటికీ ఆ విమర్శ కోసం ఆమె ఎంచుకున్న ఉపమానమే ఆశ్చర్యం కలిగిస్తోంది. మహిళా ఎమ్మెల్యే గా ఉన్నందువల్ల తన భాష విషయం లో మరింత బాధ్యత గా ఉండాల్సిన అవసరం రోజా కి ఉంది.