పోలీసులు ఎందుకు ఉన్నారు ? శాంతిభద్రతల్ని రక్షించడానికి. ఇది అధికారికం. ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే వైసీపీ కోసం పని చేయడానికి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇలా వైసీపీ కోసం పని చేయడాన్ని పోలీసులు బహిరంగంగా చేయరు. విధి నిర్వహణలో భాగంగానే చేస్తున్నాంటారు. అలాగే ఉంటుంది కూడా. అయితే ఈ నగరి ఎమ్మెల్యే రోజాకు ఈ తేడా అర్థం అయినట్లుగా లేదు.
నేరుగా పోలీస్ స్టేషన్‌కు .. అదీ కూడా ఎస్పీ ఆఫీస్‌కు వెళ్లి… తన నియోజకవర్గంలో వైసీపీ కోవర్టులున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసేశారు. చిత్తూరు ఎస్పి సెంధిల్‌కుమార్ కి నగిరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజా కలిసి విననతి పత్రం అందించారు.. కొంత మంది వైసీపీ నేతలు వైసీపిలో ఉంటూ టిడిపితో జత కలిశారని వారిని ఉపేక్షించేది లేదన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఫోటోలు వేసుకుని ఫ్లేక్సీలు వేసుకుని అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు..
గతంలో వైసీపిలో సస్పెండ్ అయిన వారు వైసీపి పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నారని, వీరిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఎస్పి సెంధిల్ కుమార్ కి ఫీర్యాదు చేసినట్లు ఆర్.కే.రోజా తెలియజేశారు. పార్టీలో ఏమైనా గొడవలు ఉంటే.. పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తారు కానీ ఇలారోజా పోలీసులకుఫిర్యాదు చేయడం ఏమిటని వైసీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.