పవన్ కల్యాణ్ చేస్తున్న రాజకీయ విమర్శల దాడితో..వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తున్నారు. ఎవరూ ఊహించనంత పెద్ద నోరున్న రోజా .. తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. తాజాగా ఆమె.. పవన్ కల్యాణ్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎదురుగా వస్తే లాగి పెట్టి కొట్టాలనుకుందని మండిపడ్డారు. ఆయన పనికిమాలినోడని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు.
కృష్ణా జిల్లాలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన రోజా.. పవన్ ప్రజల్లోకి వచ్చి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడని.. కానీ, పవన్ ను ప్రజలే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సీఎం వైఎస్ జగన్‌కు సంస్కారం నేర్పాలని పవన్ అంటున్నారు.. ఈ మాటలు వింటుంటే సన్నీ లియోన్ వేదాలు చెప్పినట్టు ఉందని ఎద్దేవా చేశారు. సన్ని లియోన్ ను రోజా ఎందుకు తక్కువ చేసిందో కానీ.. తాను కూడా సినిమా నటినేననే సంగతిని మర్చిపోయిందన్న సెటైర్లు జనసేన వైపు నుంచి వినిపిస్తున్నాయి.
జన్మభూమి కమిటీలు ఉన్నప్పుడు నీ నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా? అని పవన్ కల్యాణ్ ను అసభ్యంగా ప్రశ్నించారు రోజా. సచివాలయ వ్యవస్థ గురించి పవన్ కల్యాణ్‌కు తెలియదు.. అది చట్టం ద్వారా వచ్చిందన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మాత్రమే పవన్ కి వచ్చు.. ఆ మట్టి బుర్రకు పిచ్చి అరుపులు.. పిచ్చిగంతులు తప్ప ఏమీ తెలియదు అంటూ ఎద్దేవా చేశారు.
కొసమెరుపేమిటంటే..ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది అధికారిక సమావేశంలో. సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తే అధికారులు ఎవరూ రాలేదు. దాంతో తన కోపం .. పవన్ పై తీర్చుకున్నారు. విచారణ చేసి సమీక్షకు రాని అధికారులపై శాఖ పరిమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు.కానీ కలెక్టర్ కూడా ఆమెను పట్టించుకోరనేది అందరికీ తెలిసిన విషయం.