చిరంజీవి-రోజా.. ఒకప్పుడు వెండితెర పై డ్యుయట్లు పాడుకున్న జోడి. చామంతి పువ్వా,.. ఎంత ఘాటు ప్రేమ,, వానొచ్చేసిందో.. అంటూ డ్యుయట్లు పాడుకున్నారు వీరిద్దరు. తర్వాత పొలిటికల్ ఎంట్రీ. రోజా టీడీపీలో జాయిన్ అయ్యారు. చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టుకున్నారు. ఈ క్రమంలో రోజా, చిరుపై నానా విమర్శలు చేశారు. ”అసలు చిరంజీవికి రాజకీయం చేతకాదని” బాహాటంగానే విమర్శించారు. కొంతకాలానికి రోజా వైసీపీలో, చిరు కాంగ్రెస్ లోకి వెళ్ళారు. ఇప్పుడు కూడా చిరంజీవిపై విమర్శలు చేస్తూనే వుంటారు రోజా. అలాగే పవన్ కళ్యాణ్ పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటారు.
కట్ చేస్తే.. చిరంజీవి ఇప్పుడు వెండితెర రీఎంట్రీ ఇచ్చారు. రేపు(11) ఆయన సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా అన్నీ మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే సాక్షి ఛానల్ మాత్రం ఓ షాక్ ఇచ్చింది. ఇంటర్వ్యూకి రోజాని పపింది. మెగాస్టార్ ని ఓ అరగంట పాటు ఇంటర్వ్యూ చేసింది రోజా. ఇది షాకింగే అని చెప్పాలి. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియడం లేదు. సాక్షి ఛానల్ లో ఇంటర్వ్యూ చేసే వాళ్ళు లేరా? లేదా రోజానే చిరంజీవిని ఇంటర్వ్యూ చేయాలని ముచ్చట పడ్డారా? ఏదేమైనా ఎమ్మెల్యే హోదాలో వున్న రోజా ఇలా సడన్ గా ఓ విలేఖరిగా మారిపోవడం, అదీ ఆ పార్టీ అధినేత అయిన జగన్ ఛానల్ కోసం కావడం చర్చనీయాంశమైయింది.