భేషరతుగా క్షమాపణ చెప్పడానికి తాను సిద్ధంగా వున్నానని వైఎస్ఆర్సిపి ఎంఎల్ఎ గతంలో సభాపతి కోడెల శివప్రసాద్కు రాసిన లేఖపై వివాదం ఎందుకో అర్థం కాదు. తప్పొప్పులు ఎలా వున్నా మరో మహిళ బాధపడుతున్నానంటూ క్షమాపణ అడిగితే చెప్పడం వల్ల తగ్గేదేమీ వుండదు. బేషరతుగా గాక అయితే.. వుంటే అంటూ చెప్పేవాటిని ఎక్కడా ఆమోదించరు. ఆ విధంగా ఆమె లేఖ రాయడం జగన్కు కోపం తెప్పించిందని రాస్తున్నారు. నిజానిజాలు తెలియదు గాని దీనిపై ప్రతిష్టకు పోవడం కన్నా సారీ చెప్పి సభలో ప్రవేశించడం ఆమెకూ పార్టీకి కూడా మంచిది.ఇప్పటికే కీలకమైన సమయం గడిచిపోయింది. ప్రభుత్వం రాజకీయ కక్షతో మరో ఏడాది సస్పెండ్ చేయాలనుకోవడం సమర్థనీయం కాదు. అయితే అందుకు క్షమాపణ చెప్పకపోవడమే అభ్యంతరమైతే చెప్పడం వల్ల నష్టం లేదు. ఈ విషయమై న్యాయపోరాటం చేయడం వల్ల సమయం వృథా అవడం తప్ప పెద్ద ఫలితమూ వుండదు. వైసీపీ ఎంపి వైవిసుబ్బారెడ్డి ఈ మేరకు చేసిన ప్రకటనను మరోసారి పరిశీలించడం మంచిది. చెప్పాల్సింది చెప్పాను అయినా మీరు షరతు పెడుతున్నారు గనక బేషరతుగా క్షమాపణ అనడం వల్ల ఆమె హుందాతనం పెరుగుతుందే గాని తగ్గదు. తర్వాత తగు జాగ్రత్త తీసుకోవలసిన అవసరమూ ఏర్పడుతుంది.