రాజకీయాల్లో ఘోర పరాజయం పాలైన రోజా.. ఇప్పుడు కొంత సమయం కెరీర్ మీద పెట్టాలని అనుకుంటోంది. మంత్రి పదవి వచ్చే వరకూ జబర్దస్త్ జడ్జిగా ఆఆమె ఉన్నారు. తమిళ్ చానల్స్ లోనూ కొన్ని కార్యక్రమాలకు పని చేసేవారు. మంత్రి పదవి ఇచ్చిన తర్వాత అన్నీ వదిలేశారు. బిజీ అయ్యారు. ఇప్పుడు మంత్రి పదవే కాదు.. ఎమ్మెల్యే పోస్టు కూడా ఊడిపోవడంతో మళ్లీ టీవీ స్క్రీన్ పై కరీర్ వెదుక్కునేందుకు సిద్ధమయ్యారు.
జబర్దస్త్ లోకి మరోసారి ఎంట్రీ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో చాలా ప్రయత్నాల తర్వాత జీ టీవీలో ఓ షోలో అవకాశం దక్కించుకున్నారు. ఈ షో ప్రోమో కూడా విడుదల అయింది. సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ అనే ప్రోగ్రాంకు జడ్జి అవుతున్నారు. శ్రీకాంత్, రాశి కూడా ఇతర జడ్జిలుగా ఉంటారు.
రోజా ఈ షోలో తన కళా ప్రదర్శన చేశారు. డాన్స్‌తో తాను తగ్గేది లేదని స్పష్టం చేశారు. మంత్రిగా ఉన్నప్పుడే ఏదైనా వేదికల మీద డాన్సులు వేసేవారు. ఇక టీవీ షోలో అయితే చెప్పాల్సిన పని లేదు. ఎంటర్ టెయిన్ చేయడానికి తన మార్క్ బెస్ట్ షో చేయడానికి రోజా రెడీ అవుతారు. తమిళ చానల్స్ లోనూ ఆమె కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.