నేటి నుంచి తను శాసనసభ సమావేశాలకు హాజరుకాబోతున్నట్లు వైకాపా ఎమ్మెల్యే ఆర్.కె.రోజా నిన్న స్పష్టం చేసారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ఆమె నిన్ననే శాసనసభ ఇన్-చార్జ్ కార్యదర్శి కె.సత్యనారాయణకి అందజేశారు. తెదేపా ప్రభుత్వం దానిని హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాలు చేయబోతోందని బొండా ఉమామహేశ్వరరావు నిన్న చెప్పారు. కనుక ఈరోజు ఆమెను స్పీకర్ శాసనసభలోకి అనుమతిస్తారో లేదో ఇంకా తెలియదు. ఒకవేళ అనుమతించకపోతే అది కోర్టు ధిక్కారమే అవుతుంది కనుక అందుకు తగిన కారణాలు కూడా చూపవలసి ఉంటుంది. న్యాయవ్యవస్థతో ఘర్షణ వద్దనుకొన్నట్లయితే ఆమెను సభలోకి అనుమతించి మళ్ళీ ఏదో ఒక సాకుతో ఈ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేయవచ్చును. మరి కొద్ది సేపటిలో ఆమె వైకాపా ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభకు చేరుకోబోతున్నారు. కనుక అంతవరకు దీనిపై చిన్న సస్పెన్స్ నెలకొని ఉంటుంది.