వర్మ ఏం చేసినా సంచలనమే! ఆయన నిర్ణయాలు ఆసాంతం షాక్‌కి గురి చేసేలా ఉంటాయి. ఆయనిప్పుడు ఎన్టీఆర్ జీవిత కథని సినిమాగా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎన్టీఆర్ జీవిత కథ అనగానే అటెన్షన్ మొదలైపోతుంది. ఎన్టీఆర్ పాత్రలో ఎవరు కనిపిస్తారన్న ఆసక్తి నెలకొనడం సహజం. అందరూ ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తుంటే రాంగోపాల్ వర్మ మాత్రం లక్ష్మీ పార్వతి పాత్రధారి విషయంలో ఓ క్లారిటీకి వచ్చేశారని తెలుస్తోంది. లక్ష్మీ పార్వతిగా రోజాని ఎంచుకొన్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆమె ఇప్పుడు వైకాపాలో ఉంది. టీడీపీ ని గద్దె దించడమే వైకాపా లక్ష్యం. టీడీపీని వచ్చే ఎన్నికల్లో మట్టి కరిపించడానికి ఎన్ని మార్గాలున్నాయో.. అన్నింటినీ అన్వేషిస్తోంది వైకాపా పార్టీ. ఇప్పుడు వాళ్లకు ఎన్టీఆర్ సినిమా ఓ అస్త్రంగా మారింది. ఈ చిత్రానికి నిర్మాతగా రాకేష్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయనా వైకాపాకి చెందిన వ్యక్తే. ఇప్పుడు రంగంలోకి రోజాని తీసుకొచ్చారు. దాన్ని బట్టి… రాంగోపాల్ వర్మ ప్లాన్ ఏంటన్నది ఇట్టే అర్థమైపోతోంది. సో… ఎన్టీఆర్ బయోపిక్ టీడీపీకి వ్యతిరేకంగా రూపుదిద్దుకోనున్నదన్న విషయం ఖరారైపోయినట్టే.