యూత్ ఫుల్ దర్శకుడిగా యూత్ ని మెప్పిస్తున్న దర్శకుడు మారుతి, నిర్మాతగానూ కొత్తతరాన్ని ప్రోత్సాహించే ఉద్దేశంతో తన సొంత బ్యానర్లో మొదట్నుంచీ సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణ లో , శ్రేయాస్ మీడియా శ్రీనివాస్‌లతో కలిసి నిర్మించిన సినిమా ‘రోజులు మారాయి’. నూతన దర్శకుడు మురళి ని తెరకు పరిచయం చేస్తూ, రూపొందించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మారుతి-దిల్‌రాజు బ్రాండ్‌తో మంచి అంచనాలు రేకెత్తించిన ఈ సినిమా, ఆ అంచనాలను అందుకుందా? చూద్దాం..
కథ :
ప్రజెంట్ జెనరేషన్ కి చెందిన నలుగురు కథ ఇది . స్వతంత్రంగా జీవించే ఇద్దరు అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిల కథే ఈ సినిమా.బాగా ఆస్తి ఉన్న వారిని పెళ్లి చేసుకొని, ఇతర దేశాలలో సెటిల్ అవ్వాలని ఇద్దరు హీరోయిన్ల ఆద్య (కృతిక), రంభ (తేజస్వి)..ను, ఇద్దరు హీరో లు అశ్వద్ (చేతన్), పీటర్ (పార్వతీశం) తమని ప్రేమించమని ఫోర్స్ చేస్తుంటారు.ఇది ఆసరాగా తీసుకుని హీరోయిన్స్ దీనికోసం మన ఇద్దరు హీరోలను పావులాగా వాడుకోవాలని ప్లాన్ చేస్తారు. తమ హాస్టల్ మిత్రుల సలహా మేరకు, ఒకరోజు శ్రీశైలంలోని ఓ బాబా ను కలుస్తారు అతను చెప్పిన మాటలను బట్టి తమ జీవితంలోకి రాబోయే వ్యక్తి పెళ్ళైన కొన్నిరోజులకే చనిపోతాడని ఆద్య, రంభలకు తెలుస్తుంది. తరువాత ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లను పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తరువాత కొన్ని రోజులకు ఇద్దరు హీరోలు చనిపోయినట్టు తెలుస్తుంది. ఇద్దరు హీరోలు ఎందుకు ఎలా చనిపోతారు ? వీరిద్దరికీ ఏమి జరుగుతుంది ? వీరిద్దరిని ఎవరు చంపుతారు ? సాధువు వీరికి ఏమి చెప్తాడు ? వీటన్నిటి సమాధానం తెరమీద సినిమా చూసి తెలుసుకోవలసి ఉంది …!
ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :
నలుగురు నటీనటుల్లో పార్వతీశంను ఈ సినిమాకు హైలైట్‌గా చెప్పుకోవచ్చు. తన కామెడీ టైమింగ్‌తో, డైలాగ్ డెలివరీతో పార్వతీశం సినిమాకు మంచి హుషారు తీసుకొచ్చాడు. ఇక చేతన్ ఓ సాఫ్ట్ క్యారెక్టర్లో బాగా చేశాడు. కృతిక పాత్ర చాలా కాంప్లికేటెడ్. ఒకేసారి రెండు కోణాల్లోనూ ఆలోచించే ఈ పాత్రలో ఆమె మంచి ప్రతిభ చూపింది. ఇక తేజస్వి టైమింగ్, చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ను పలికించడంలో కూడా చూపిన ప్రతిభ చాలా బాగుంది. నటనలో నలుగురు ఓ కె నిపించారు.మిగతా నటి నటులు వారి వారి పరిధి లో నటించారు.
సాంకేతిక వర్గం :
మారుతి అందించిన స్క్రీన్‌ప్లే మొదటి సగమంతా చాలా బాగుంది. ఇలాంటి కథాంశాన్ని ఎంచుకొని, దాన్ని ఒక సినిమాగా మార్చే ప్రక్రియలో మారుతి ఫస్టాఫ్‌లో సూపర్ అనిపించుకున్నాడు. అయితే సెకండాఫ్‌కి వచ్చేసరికి సినిమాను మరీ రొటీన్‌గా మార్చేసి, చివర్లో అనవసర డ్రామా పెట్టి సాదాసీదాగా మార్చేశాడు. మారుతి కథతో దర్శకుడు మురళి సినిమాను మరి కిల్ చేసాడు. దర్శకుడిగా ఇంటర్వెల్ బ్లాక్‌లో మాత్రం మురళి మంచి ప్రతిభ చూపాడు. సెకండాఫ్ విషయంలో ఫెయిల్ అయ్యాడు.జె.బీ సంగీతం బాగుంది. అన్నీ సందర్భానుసారంగా వచ్చే పాటలే కావడంతో సినిమాలో బాగా కుదిరాయి. సినిమాటోగ్రాఫర్ పనితనం బాగుంది. రవి నంబూరి మాటలు బాగున్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా ఎక్కడా చిన్న సినిమా అన్న ఫీల్ లేకుండా అన్ని విభాగాలు బాగున్నాయి.
విశ్లేషణ :
గతం లో నలుగురు యువకులతో ఒక మంచి కామెడీ థ్రిల్లింగ్ మూవీస్ చాలా వచ్చాయి. ఎప్పటికప్పుడు తాజా పరిణామాలతో తీస్తూ సక్సెస్ అయ్యారు. అయితే ఈ సినిమా విషయం లో అలాంటి కాన్సెప్ట్ తో తీయాలనుకున్న డైరెక్టర్ సినిమా మొదటి భాగములో మంచి కథతో గట్టిగానే ప్రయత్నించినప్పటికీ, అదే పట్టుదల సినిమా మొత్తం కొనసాగించలేకపోయాడు. మంచి కామెడీ , డయలాగ్స్ ఉన్నప్పటికీ డైరెక్టర్ ప్రేక్షకులకు న్యాయం చేయలేకపోయాడు అని చెప్పాలి. సినిమా మొదటి భాగం పరవాలేదు అని అనిపించినా రెండవ భాగం మాత్రం ఎదో తీయాలంటే తీయాలి అని కానిన్చినట్టు గా అనిపిస్తుంది. ఈ సినిమాలో నటించిన యువ నటులు తేజస్వి మదివాడ, చరణ్ మదినేని మరియు కృతిక తమ నటనతో పాత్రకు మరియు సినిమాకు న్యాయం చేసారు. యువ నటులు అయినా నటనలో మంచి నైపుణ్యం ప్రదర్శించారు. ఈ సినిమాలోని మంచి కామెడీ సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. జేబి అందించిన సంగీతం కుడా పరవాలేదు అనిపించాడు. మంచి కామెడీ , డయలాగ్స్, నిర్మాణ విలువలు మరియు నటన లాంటివి ఇన్ని కలసి వచ్చినా ఈ సినిమాకు డైరెక్టర్ న్యాయం చేయలేకపోయాడు. ఈ విషయం లో డైరెక్టర్ ఘోరంగా విఫలమయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రెండవ భాగం. సినిమా టైటిల్‌కి సినిమాకు సంబంధం లేనట్టు అనిపిస్తుంది. ధియేటర్లో తెలుగు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాడు డైరెక్టర్. కాస్త క్లారిటీతో రెండవ భాగం గాననీ చేసి ఉంటే తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ సాదించేది .
తెలుగు360.కామ్ రేటింగ్ 2/5
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రీయేషన్స్ మరియు మారుతి టాకీస్ తో కలిసి…. గుడ్ సినిమా గ్రూప్
నటి నటులు : చేతన్ మద్దినేని, పార్వతీశం, కృతిక జయకుమార్, తేజస్విని మడివాడ, పోసాని కృష్ణ మురళి, రాజా రవీంద్ర, అలీ , వాసు ఇంటూరి , శశాంక్ , జబర్దస్త్ అప్ప రావు, రావి పల్లి రాంబాబు, ఏలూరు శ్రీను, మధుసూదన్ రావు, హర్ష, సంధ్య జనక్ తది తరులు….
మాటలు : రవి నంబూరి,
సంగీతం :జె .బి,
సమర్పణ : దిల్ రాజు,
నిర్మాత : జి. శ్రీనివాసరావు,
దర్శకుడు : మురళి కృష్ణ ముడిదని.
విడుదల తేదీ : 01.07.2016