దివ్యవాణి….తాను బాపుగారి బొమ్మ…. తెలుగు ప్రేక్షకులలో తనదైన ముద్రవేసుకుందీ ముద్దుగుమ్మ…పెళ్లి పుస్తకం తో తన సినీ పుస్తకం తెరిచి, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం, ఇద్దరు పిల్లల ముద్దుల పొలిసు, సుమారు యాభై సినిమాలతో తన సినీ పుస్తకం నింపేసుకుందీ బాపు బొమ్మ. తెలుగు వారింట్లో ఎక్కడ పెళ్లి జరిగిన ‘శ్రీ రస్తు..శుభమస్తు…’ పాట మోగాల్సిందే…పెళ్లి వీడియోలలో చూడాల్సిందే…ఆ పాట వింటే దివ్య వాణి గురుతుకు రావాల్సిందే…తన సహజ నటనతో అలరించిన అలనాటి నటి దివ్య వాణి ప్రస్తుతం నా పేరు మీనాక్షి, పవిత్ర బంధం సీరియల్స్ లో మహా నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నిర్మిస్తున్న ‘మహా నటి’ చిత్రం లో సావిత్రి తల్లి పాత్రలో నటిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – ” మహా దర్శకుడు సర్గీయ బాపు గారి అస్సిసులతో తెలుగు ప్రేక్షకులకు బాపు బొమ్మగా పరిచయమైనా నేను నిజంగా అదృష్టవంతురాలిని. హీరోయిన్ గా పెళ్లి పుస్తకం చిత్రం తో పరిచయం అయినా…ఆ చిత్రానికి ముందుగా నా ఫస్ట్ మూవీ ‘సర్దార్ కృష్ణమ నాయుడు’ దాని తరువాత ‘ముత్యమంతా ముద్దు’ ఆ చిత్రాలలో చేశాను. ఆ తరువాత పెళ్లి పుస్తకం లో అప్పటి ఇరవై మంది హీరోయిన్స్ లలో నాకు అదృష్టం వరించింది. ఇప్పటివరకు యాభై సినిమాలలో తెలుగు, తమిళ్, మరియు హిందీ చిత్రాలలో నటించాను. ఇటీవల మా అమ్మాయి చదువు కోసమని నేను చెన్నై నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఇదే సమయం లో అనుకోకుండా నాకు ఈ టివి వారి ‘నా పేరు మీనాక్షి’, స్టార్ మా వారి ‘ప్రవిత్ర బంధం’, సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఈ రెండు సీరియల్స్ , ప్రతిష్ఠతకమైన ఒక తెలుగు సినిమా చేస్తున్నాను. వైజయంతి మూవీస్ వారి ‘మహా నటి’ దీనికి నాగ్ అశ్విన్ దర్శకుడు నిర్మాత అశ్వనీదత్ గారు ఇందులో నా పాత్ర సావిత్రిగా నటిస్తున్న కీర్తి సురేష్ తల్లిగా నటిస్తున్నాను. తెలుగు పెర్ఫార్మన్స్ స్కోప్ వుండి ఇంకా మంచి పాత్రలు వస్తే తప్పనిసరిగా చేస్తాను.”అన్నారు.