నిర్మలా కాన్వెంట్‌తో హీరో అయ్యాడు… శ్రీకాంత్ తనయుడు రోషన్. తొలి సినిమాలో బాగానే నటించాడన్న టాక్ వచ్చింది. హీరోగానూ మంచి భవిష్యత్తు ఉందని అనిపిస్తోంది. అయితే రెండేళ్ల వరకూ రోషన్ సినిమాకు దూరంగా ఉంటాడట. ఈలోగా నటనకు సంబంధించిన మరిన్ని మెళకువలను నేర్చుకొని అప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడట. ఈసారి పూర్తి స్థాయి హీరోగా రంగ ప్రవేశం చేయించవచ్చన్నది శ్రీకాంత్ వ్యూహం. అయితే హీరోగానూ రోషన్ ఎంట్రీ అన్నపూర్ణ బ్యానర్లోనే ఉండబోతోంది. ఇందుకు సంబంధించి నాగార్జున కూడా శ్రీకాంత్‌కి మాటిచ్చేశాడని విశ్వసనీయ వర్గాల సమాచా రం.
నిర్మలా కాన్వెంట్లో రోషన్ నటన నాగ్‌కి బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమా ఫలితం ఎలాగున్నా సరే…హీరోగా మాత్రం నేనే ఇంట్రడ్యూస్ చేస్తా అని నాగ్ శ్రీకాంత్‌కి చెప్పాడట. శ్రీకాంత్ కూడా ఆనందంగా ఒప్పుకొన్నాడట ఈ రెండేళ్లూ రోషన్ చదువుపై ద్రుష్టి పెడతాడని, దాంతోపాటుగా డాన్సుల్లో, పోరాట దృశ్యాల్లోనూ కోచింగ్ తీసుకోనున్నాడని తెలుస్తోంది. ‘‘తొలి సినిమాలోనే రోషన్ బాగా చేశాడు. అయితే తను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ విషయం తనకి కూడా తెలుసు. అందుకే మరో రెండు మూడేళ్ల పాటు సినిమాకు దూరంగా ఉంచుదామనుకొంటున్నా. వివిధ అంశాల్లో విషయాల్లో నైపుణ్యం సాధించిన తరవాతే మళ్లీ సినిమాల్లొకి వస్తాడు’’ అని శ్రీకాంత్ తెలిపారు. నిర్మలా కాన్వెంట్ సెట్స్‌లో ఉండగానే రోషన్‌కి కొన్ని అవకాశాలొచ్చాయని అయితే.. శ్రీకాంత్ సున్నితంగా తిరస్కరించాడని, హీరోగా లాంఛ్ భారీ స్థాయిలో చేయాలని నిర్ణయం తీసుకోవడమే అందుకు కారణం అని సమాచారం.