రష్మిక అంటే… విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు స్పెషల్ క్రేజ్. విజయ్‌తో రష్మిక అనుబంధం అలాంటిది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసేసుకొంటారని ఇది వరకే బోలెడు వార్తలొచ్చాయి. వాటిని వీరిద్దరూ ఎప్పుడూ ఖండించలేదు. ‘అవును’ అని కూడా చెప్పలేదు. కాకపోతే… రష్మిక, విజయ్ చేసే పనులు, చెప్పే సమాధానాలు, మాట్లాడే మాటలు చూస్తే మాత్రం వీరిద్దరి అనుబంధం నిజమే అని రూఢీ అవుతూనే ఉంటుంది. తాజాగా ‘గం గం గణేషా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రష్మిక అతిధిగా విచ్చేసింది. ఈ ఫంక్షన్లో.., రష్మిక – ఆనంద్ దేవరకొండ మధ్య చిన్న చిట్ చాట్ జరిగింది. ఆనంద్ అడిగిన కొన్ని ప్రశ్నలకు రష్మిక ఇచ్చిన సమాధానాలు ఆసక్తిని కలిగించాయి. ఈ మాటల్ని ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ డీ కోడ్ చేయడం మొదలెట్టారు.
రష్మికని తన ఫేవరెట్ కో స్టార్ ఎవరని అడిగితే… విజయ్ పేరు చెప్పింది. ఫేవరెట్.. డెస్టినేషన్ ఏమిటని అడిగితే ‘వియాత్నాం’ అంది. విజయ్, రష్మికలు తొలిసారి కలిసి వెళ్లిన ఫారెన్ ట్రిప్ వియాత్నాం అని అందుకే రష్మిక ఆ పేరు చెప్పిందని డీ కోడ్ చేసిన ఫ్యాన్స్ అంటున్నారు. ఈ చిట్ చాట్ లో రష్మిక ‘నువ్వు నా ఫ్యామిలీరా’ అని ఆనంద్ ని ఉద్దేశించి అంది. దాంతో రౌడీ కుటుంబంలోకి రష్మిక అడుగుపెట్టబోతోందన్న సంకేతాలు అందేసినట్టే అన్నది ఫ్యాన్స్ మాట. ఈ వేడుకలో రష్మిక – ఆనంద్‌ల బాండింగ్ కూడా ఆకట్టుకొంది. ఫ్యాన్స్ కూడా రష్మికను ‘వదినా..’ అంటూ సంబోధించడం మొదలెట్టేశారు. చూస్తుంటే ఈ బంధం ముదిరి పాకాన పడినట్టే కనిపిస్తోంది. మరి ఆ తీపి కబురు ఎప్పుడు అందిస్తారో..!