ఆర్.ఆర్.ఆర్… చరిత్ర సృష్టించింది. నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కింది. ఈరోజు… తెల్లవారుఝామున కాలిఫోర్నియాలో అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అందుకొంటూ.. ఉద్దేగానికి లోనయ్యారు. రాజమౌళి, నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్, రచయిత చంద్రబోస్, గానం చేసిన కాలభైరవ వల్లే ఈ పురస్కారం వచ్చిందని, వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఇది వరకు ఏ.ఆర్.రెహమాన్ అందుకొన్నారు. అయితే అది హాలీవుడ్ సినిమాకి. ఓ స్వచ్ఛమైన భారతీయ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ దక్కడం ఇదే తొలిసారి. ఈ పాట.. ఇప్పుడు ఆస్కార్ బరిలోనూ ఉన్న సంగతి తెలిసిందే. బెస్ట్ వర్జినల్ సాంగ్ కేటరిగీలో పోటీ పడుతోంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు మినీ ఆస్కార్ లాంటిది. గోల్డెన్ గ్లోబ్ వస్తే… ఆస్కార్ కి మరింత దగ్గరైనట్టే. మరి ఆ కల కూడా నెరవేరితే… ఆర్.ఆర్.ఆర్..ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టినట్టే. తెలుగు వాడి ఘనత కీర్తి నలుదిశలా చాటిన.. ఆర్.ఆర్.ఆర్ బృందానికి తెలుగు 360 అభినందనలు తెలుపుకొంటోంది. కంగ్రాట్స్… కీరవాణి.. అండ్ ఆర్.ఆర్.ఆర్ టీమ్..