రాజమౌళి కుటుంబం మొత్తం లండన్ వెళ్లింది. అక్కడ ‘బాహుబలి’కి సంబంధించిన ఓ ఈవెంట్లో పాల్గొంది. దాంతో #RRR షూటింగ్‌కి విరామం వచ్చేసింది. ఇప్పుడు మళ్లీ #RRR లైన్లోకి వచ్చింది. రాజమౌళి కుటుంబం హైదరాబాద్ తిరిగి రావడంతో కొత్త షెడ్యూల్‌పై దృష్టి సారించారు. సోమవారం నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ మొదలుకానుంది. ఈసారి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరిపైనా సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది. #RRR టైటిల్‌పై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని, మంచి రోజు చూసుకుని టైటిల్‌ని ప్రకటిస్తారని తెలుస్తోంది. కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ లుక్ బయటకు రానున్నదని బాగా ప్రచారం జరిగింది. కానీ… రాజమౌళి టీమ్ అలాంటి ప్రయత్నమేదీ చేయలేదు. దీపావళికి ఈ టీమ్ నుంచి ఎలాంటి లుక్కులూ రాకపోవొచ్చు. టైటిల్ కూడా చెప్పే అవకాశాలు లేవు. #RRR నుంచి ఫస్ట్ లుక్ రావాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.